బిజినెస్

బలపడిన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 24: ఆరు సెషన్ల పాటు పడిపోయిన రూపాయి విలువ మంగళవారం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం పది పైసలు పెరిగి, 66.38 పైసల వద్ద ముగిసింది. ఎగుమతిదారులు, బ్యాంకులు తాజాగా అమెరికన్ కరెన్సీ అమ్మకాలకు పూనుకోవడం వల్ల రూపాయి విలువ పెరిగింది. మంగళవారం తొలుత జరిగిన లావాదేవీల్లో రూపాయి విలువ 66.29 పైసల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, తరువాత కాస్త తగ్గింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, వాణిజ్య లోటు పెరుగుతుందేమోననే ఆందోళన కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రితం ఆరు సెషన్లలో కలిపి సుమారు రెండు పైసలు పడిపోయింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం తలెత్తే అవకాశాలు తాత్కాలికంగా కాస్త తగ్గినప్పటికీ, కరెన్సీ వ్యాపారులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ, లాంగ్ పొజిషన్లు తీసుకోవడానికి వెనుకాడారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర వరుసగా ఆరో రోజు పెరిగింది. మూడేళ్ల గరిష్ఠ స్థాయి అయిన బారెల్‌కు 75 డాలర్ల ధర పలికింది.