బిజినెస్

మోసాలతో బ్యాంకులు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 24: దేశంలోని 26 జాతీయ బ్యాంకులకు గత నాలుగేళ్లలో జరిగిన మోసాల వలన రూ.30 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వం నుంచి రూ.25 వేల కోట్ల ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యాంకులు 2011-12 నుంచి 2014-15 మధ్య కాలంలో జరిగిన మోసాల వలన రూ.30,873.86 కోట్లు నష్టపోయాయి. లక్ష రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తాలకు సంబంధించిన మోసాల వల్లనే ఈ బ్యాంకులకు ఇంత నష్టం వాటిల్లినట్లు ఆర్థిక శాఖ నుంచి లభ్యమైన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మోసాలకు సంబంధించిన కొన్ని కేసులపై దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దృష్టి సారించాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తాజాగా సిండికేట్ బ్యాంకు వాటిల్లిన రూ.1000 కోట్లకు పైగా నష్టంపై దర్యాప్తులో భాగంగా ఉదయ్‌పూర్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్‌ను, జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్తను అరెస్టు చేసింది. కర్నాటక కేంద్రంగా పనిచేస్తున్న సిండికేట్ బ్యాంకుకు 2011-15 మధ్య కాలంలో జరిగిన మోసాల వలన రూ.1,133.31 కోట్ల నష్టం వాటిల్లింది. లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలకు జరిగిన మోసాలకు సంబంధించి ఈ బ్యాంకు 445 కేసులు దాఖలు చేసింది.
2011-15 మధ్య కాలంలో జరిగిన మోసాల వలన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), దాని ఐదు అనుబంధ బ్యాంకులకు అత్యధికంగా రూ.5,881.20 కోట్ల నష్టం వాటిల్లింది. వీటిలో ఒక్క ఎస్‌బిఐకే 2,049 మోసాల వలన రూ.3,461.74 కోట్ల నష్టం వాటిల్లగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)కు 139 మోసాల వలన రూ.876.43 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్‌కు 153 మోసాల వలన రూ.440.88 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలాకు 129 మోసాల వలన రూ.403.65 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్‌కు 119 మోసాల వలన రూ.398.49 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌కు 67 మోసాల వలన రూ.300.01 కోట్లు చొప్పున నష్టం వాటిల్లింది.
అలాగే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న ఐడిబిఐ బ్యాంకు పైన పేర్కొన్న నాలుగేళ్లలో 388 ఫ్రాడ్ కేసుల వలన రూ.1,350.69 కోట్లు, కెనరా బ్యాంకు 334 ఫ్రాడ్ కేసుల వలన రూ.1,309,14 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు 303 మోసాల వలన రూ.956.74 కోట్లు, విజయా బ్యాంకు 182 ఫ్రాడ్ కేసుల వలన రూ.942.91 కోట్లు, ఇతర అన్ని బ్యాంకులు 5,844 మోసాల వలన రూ.19,299.87 కోట్లు నష్టపోయాయి.