బిజినెస్

ఈపిడిసిఎల్ ఆధ్వర్యంలో వెయ్యి కోట్ల ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 21: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ మరింత పటిష్ఠ పరిచేందుకు వీలుగా నిర్మాణాత్మక ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇందులోభాగంగా ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఆధ్వర్యంలో వెయ్యి కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయ. ఈ ప్రతిపాదనలను మంగళవారం ఈపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయానికి వచ్చిన ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం వెయ్యి కోట్ల నిధుల్లో రూ. 390 కోట్లతో హైవోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (హెచ్‌విడిఎస్)ను పూర్తిస్థాయిలో విస్తరించడం ద్వారా వ్యవసాయ విద్యుత్‌ను పటిష్టంగా అమలు చేయవచ్చు. సరఫరాలో అంతరాయాలు, వ్యవసాయ విద్యుత్ లైన్లలో లోపాలు, సాంకేతికపరమైన సమస్యలు వంటి వాటిని సులభంగా అధిగమించేందుకు వీలుంటుంది. బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే ఈ సరికొత్త విధానం వలన సంస్థకు వచ్చే విద్యుత్ నష్టాలు తగ్గుతాయి. మరో రూ. 260 కోట్ల రూపాయలతో సంస్థ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మించడం జరుగుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకు సబ్‌స్టేషన్లపై ఉన్న లోడ్‌ను తగ్గించినట్టు అవుతుంది. నిరంతర విద్యుత్‌తోపాటు కొత్త కనెక్షన్లు మంజూరు చేసేందుకు అవకాశాలు ఏర్పడతాయి. స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, కాకినాడ ప్రాంతాల్లో ‘స్మార్ట్ మీటర్ల’ను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకించి రూ. 200 కోట్ల మేర వెచ్చించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. తొలుత ప్రయోగాత్మకంగా స్మార్ట్‌సిటీలకే పరిమితం కానున్న స్మార్ మీటర్ల వలన రిమోట్‌తోనే రీడింగ్ తీస్తారు. దీంతో లోపాలకు తావు లేకుండా కచ్చితమైన బిల్లు కళ్ళెదుట కనిపిస్తుంది. మరో రూ. 150 కోట్లను ఇంటర్ లింకింగ్ విద్యుత్ లైన్ల నిర్మాణం, తదితర విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి వినియోగించనుంది. ఈ విధంగా వెయ్యి కోట్ల భారీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించడంతో త్వరలో దీనికి ఆమోదం లభిస్తుందని ఈడిపిసిఎల్ భావిస్తోంది.