బిజినెస్

ఎయిర్‌టెల్, టెలినార్ విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: మొబైల్ సర్వీసు ప్రొవైడర్ కంపెనీల విలీనం ప్రక్రియ ఊపందుకుంది. ఒక నెలరోజుల్లోనే ఎయిర్‌టెల్, టెలినార్ కంపెనీల విలీనం ప్రక్రియకు అనుమతి ఇస్తామని టెలికాం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. అలాగే ఐడియా, వొడాఫోన్‌ల విలీనం కూడా వీలైనంత త్వరలో ముగుస్తుందని ఆమె చెప్పారు. ఐడియా, వోడాఫోన్ల విలీనంలో ఎటువంటి జాప్యం లేదని, అలాగే ఆటంకాలు కూడా లేవని ఆమె చెప్పారు. ఈ రెండు సంస్థలు విలీనమైతే దేశంలో అతి పెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా అవతరిస్తాయని అంచనా. టెలినార్ కంపెనీని ఎయిర్ టెల్ టేకోవర్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని టెలికాం ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను టెలికాం సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
కాని కోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కంపెనీల విలీనం ప్రక్రియకు అవాంతరాలు లేవని తేలింది. ఈ రెండు కంపెనీల విలీనానికి నెలరోజుల్లోనే అనుమతి లభిస్తుందని సుందరరాజన్ తెలిపారు. వోడాఫోన్, ఐడియాల విలీనంపై బ్యాంకు గ్యారంటీ అనుమతులు త్వరలోనే వస్తాయన్నారు. అనుమతుల విషయంలో టెలికాం శాఖ, డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ సంస్థలు ఎటువంటి అవరోధాలు సృష్టించవన్నారు. గురువారం ఢిల్లీలో సిఐఐ సదస్సులో పాల్గొన్న అనంతరం విలేఖర్లతో ముచ్చటిస్తూ ఆమె పై వివరాలను వెల్లడించారు. గత నెలలోనే ఐడియా సంస్థ వోడాఫోన్‌తో విలీనంపై ప్రకటన చేసింది. ఈ రెండు కంపెనీల్లో వంద శాతం విదేశీపెట్టుబడులను పెట్టే విషయమై టెలికాం మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.