బిజినెస్

వాటాల విక్రయంపై తేల్చుకోని సాఫ్ట్‌బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ఫ్లిప్‌కార్ట్‌లో తనకు ఉన్న 20 శాతం వాటాలను అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌కు విక్రయించే ప్రతిపాదనపై ఎటువంటి నిర్ణ యం తీసుకోలేదని జపాన్ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం రోజుల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాలను కొనుగోలు చేస్తున్న ట్లు వాల్‌మార్ట్ ప్రకటించిన విషయం విదితమే. ఫ్లిప్ కార్ట్ నుంచి వైదొలిగే విషయమై ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని సాఫ్ట్‌బ్యాంకు వర్గాలంటున్నాయి. ఈ సంస్థ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫ్లిప్ కార్ట్‌లో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాఫ్ట్ బ్యాంకు పె ట్టింది. ఫ్లిప్ కార్ట్‌లో దీర్ఘకాలం ఇనె్వస్టర్‌గా ఉండాలన్న యోచనతో సాఫ్ట్ బ్యాంక్ గ్రూపు పెట్టుబడులు పెట్టింది. సాఫ్ట్ బ్యాంక్ వాటాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వాల్‌మార్ట్ ఇప్పటికే సంకేతాలు పంపినా, ఆ సంస్థమాత్రం స్పందించలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్ బ్యాంకు పెట్టుబడి ఇప్పుడు 4 బిలియన్ డాలర్లకు చేరింది. సాఫ్ట్‌బ్యాంకు ఒక వేళ తన వాటాలను విక్రయించరాదనుకుంటే, వాల్‌మార్ట్ 55 శాతం వాటాలతో సంతృప్తి పడాల్సి ఉంటుంది.