బిజినెస్

భారత్ బయోటెక్‌కు పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ‘రోటావాక్’ వ్యాక్సిన్ రూపొందించిన బయోఫార్మన్యూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్‌కు ప్రతిష్ఠ పురస్కారం లభించింది. 20వ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా సాంకేతిక పురస్కారాన్ని శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ మోహన్, వైరల్ వ్యాక్సిన్ డైరెక్టర్ హర్షవర్ధన్ సంయుక్తంగా అందుకున్నారు. అతిసారాన్ని నియంత్రించే లక్ష్యంగా రోటావాక్ వ్యాక్సిన్‌ను హైదరాబాద్ ప్రధాన కార్యలయంగా నడుస్తున్న భారత్ బయోటెక్ సంస్థ 2015లో ఆవిష్కరించింది.ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి సాయిప్రసాద్ మాట్లాడుతూ ఈ టీకాను ఉత్పత్తి చేయడమే కాకుంటా ప్రపంచ వ్యాప్తంగా తక్కువ ధరలకే తమ సంస్థ ఎగుమతులు చేస్తున్నట్టు చెప్పారు.అతిసారంపైనే కాకుండా పోలీయో నివారణలో భారత్ బయోటేక్ రూపొందించిన టీకాలను అంతర్జాతీయంగా మంచి ఆదరణ లభిస్తుందని ఆయన చెప్పారు.