బిజినెస్

మందగించిన పారిశ్రామిక ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) గత ఐదు నెలల్లో కనిష్ట స్థాయిలో మార్చి నెలలో 4.4 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. 2016-17లో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక 4.6 శాతం వృద్ధిరేటును నమోదు చేయగా, ఈ రేటు 2017-18లో 4.3 శాతానికి తగ్గింది. గత ఏడాది ఐఐపి వృద్ధిరేటు 4.4 శాతం నమోదు కాగా, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రికార్డయింది. ఈ వివరాలను సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్‌వో) విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో 1.8 శాతం మేర ఐఐపి నమోదైంది. కాగా తయారీ రంగంలో అభివృద్ధి నమోదైంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో తయారీ రంగం వాటా 77 శాతంగా ఉంది. గత ఏడాది 3.3 శాతం వృద్ధి చెందగా, ఈ ఏడాది 4.4 శాతం మేరకు పెరిగిందని సిఎస్‌వో తెలిపింది. గత ఏడాది మార్చిలో మైనింగ్ సెక్టార్‌లో 10.1 శాతం మేర వృద్ధి రేటునమోదు కాగా, ఈ ఏడాది మార్చిలో 2.2 శాతానికి పడిపోయింది. విద్యుత్ రంగంలో కూడా పరిస్థితి ఆశాజనకంగాలేదు. గత ఏడాది మార్చి నెల వరకు 6.2 శాతం మేర వృద్ధిరేటు ఉంటే, ఈ ఏడాది మార్చికి తగ్గి 5.2 శాతానికి దిగజారింది. వినియోగదారులు వాడే వస్తువుల ఉత్పత్తి వృద్ధిరేటు బాగుంది. 2.9 శాతం మేర వృద్ధి నమోదైంది. 2017-18లో తయారీ రంగంలో పెరుగుదల రేటు 4.5 శాతం ఉందని సిఎస్‌వో పేర్కొంది.