బిజినెస్

రూ. వెయ్య కోట్లు డిపాజిట్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: వచ్చే నెల 15వ తేదీలోపల తమ పరిధిలోని రిజిస్ట్రీ వద్ద రూ. 1000 కోట్ల నిధులను డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు బుధవారం రియాల్టీ సంస్థ జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌ను ఆదేశించింది. ఈ సొమ్ము ఇంటి కొనుగోలు దారులకు అందిస్తామని కోర్టు పేర్కొంది. ఈ నిధులను డిపాజిట్ చేస్తే జైపీ ఇన్‌ఫ్రాటెక్ సంస్ధకు సంబంధించి లిక్విడేటెడ్ ప్రొసీడింగ్స్‌పై స్టే కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రతోకూడిన ధర్మాసనం జారీ చేసింది. నిర్దేశించిన కాలపరిమితిలోపల ఒక వేళ తాము ఇచ్చిన ఆదేశాలకు లోబడి రూ.1000 కోట్లను డిపాజిట్ చేయని పక్షంలో జైప్రకాశ్ అసోసియేట్స్‌పై చట్టబద్ధమైన చర్యలు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. గతంలో సుప్రీం కోర్టు రిజిస్ట్రీ వద్ద రూ. 2000 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కాగా జైప్రకాశ్ అసోసియేట్స్ రూ. 750 కోట్లను డిపాజిట్ చేసింది. ఈ సంస్థ తరఫున న్యాయవాది అనుపమ్ లాల్ దాస్ వాదనలు వినిపిస్తూ, జైప్రకాశ్ అసోసియేట్స్‌ను పునరుద్ధరించేందుకు తాజా ప్రణాళికను రూపొందిస్తున్నామని, దీనిని కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. ఇంటి కొనుగోలుదారులు, క్రెడిటర్లకు ఈ సంస్థను లిక్విటేషన్ చేయడం వల్ల ప్రయోజనంలేదని ఆయన తెలిపారు. తమ సంస్థకు చెందిన షేర్లను ప్రతి కొనుగోలుదారుడికి రెండు వేల వాటాల చొప్పున కేటాయించాలనే ప్రతిపాదన ఉందన్నారు. తమ సంస్థను పదివేల కోట్ల రూపాయలతో పునరుద్ధరించాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ను తమ సంస్థ విషయంలో అమలు చే యకుండా అలహాబాద్‌లోనని జాతీ య కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆదేశించాలని న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ప్రతి నెల 500 ఇండ్లను నిర్మించి కొనుగోలుదారులకు ఇస్తున్నామని, తమ ప్రతిపాదనను చట్టప్రకారం ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్‌పి) పరిశీలించాలని ఆయన అభ్యర్థించారు. కాగా రిజిస్ట్రీ వద్ద డిపాజిట్లు ఏమైనా మిగిలి ఉంటే, జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.