బిజినెస్

45 శాతం తగ్గిన విదేశీ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 23: దేశీయ సంస్థలు ఈ ఏడాది మే నెలలో విదేశీ మార్కెట్ల నుంచి 1.32 బిలియన్ డాలర్ల రుణాలను సేకరించాయి. 2015 మే నెలలో భారత సంస్థలు విదేశీ మార్కెట్ల నుంచి సేకరించిన 2.39 బిలియన్ డాలర్ల రుణాల కంటే ఇవి 45 శాతం తక్కువని రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గురువారం వెల్లడించింది. దేశీయ సంస్థలు ఈ ఏడాది మే నెలలో విదేశీ మార్కెట్ల నుంచి సేకరించిన మొత్తం రుణాల్లో విదేశీ వాణిజ్య రుణాలు (ఇసిబిలు), ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ (ఎఫ్‌సిసిబిలు) రూపంలో అనుమతుల మార్గం ద్వారా సేకరించిన రుణాలు 845.72 మిలియన్ డాలర్లుగా ఉండగా, మిగిలిన 472.69 మిలియన్ డాలర్ల రుణాలు ఆటోమ్యాటిక్ మార్గం ద్వారా వచ్చాయి. ఈ ఏడాది మే నెలలో అనుమతుల మార్గం ద్వారా హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ 375 మిలియన్ డాలర్లు, రిలయెన్స్ ఇండస్ట్రీస్ 190.72 మిలియన్ డాలర్లు, అదానీ పోర్ట్స్ 150 మిలియన్ డాలర్లు, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 130 మిలియన్ డాలర్లు సేకరించగా, ఆటోమ్యాటిక్ మార్గం ద్వారా రుణాలు సేకరించిన ప్రధాన సంస్థల్లో సింటెక్స్ ఇండస్ట్రీస్ (110 మిలియన్ డాలర్లు), అల్ట్రాటెక్ సిమెంట్ (50 మిలియన్ డాలర్లు), ఎగ్జిమ్ బ్యాంక్ (50 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.