బిజినెస్

పన్ను చెల్లింపుదార్ల ఫిర్యాదుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: వచ్చేనెల ఆదాయం పన్ను చెల్లింపుదార్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి పక్షోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)శాఖ ఆదాయం పన్ను శాఖను ఆదేశించింది. పన్ను చెల్లింపులకు సంబంధించి తలెత్తిన వివాదాలు, సర్దుబాట్లను పరిష్కారాలని ఆదేశించింది. జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశంలోని అన్ని ప్రాంతీయ ఆదాయం పన్ను శాఖ కార్యాలయాలు ఈ పక్షోత్సవాలను ని ర్వహించాలని కోరింది. పన్నుల చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలు, సర్దుబాట్లను సరిదిద్దడంలో జరుగుతున్న జాప్యం సరికాదని పేర్కొన్నారు. ఈ వివరాలు సిబిడిటి సభ్యుడు అజిత్ కె శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఆదాయం పన్ను శాఖలు పెండింగ్‌లో ఉన్న క్లైమ్స్‌ను పరిష్కరించాలని కోరారు. ఈ విషయమై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆదాయం ప న్ను చట్టంలోని సెక్షన్ 245కు లోబడి ఆదా యం పన్నును సర్దుబాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని, దీనికి చెల్లింపుదారులు సహకరించాలన్నారు. పక్షోత్సవాలకు అందరు అధికారులు హాజరయ్యేటట్లు చూడాలని సిబిడిటి కోరింది. ప్ర తిరోజూ ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు చెల్లింపుదార్ల సమస్యలు, ఫిర్యాదులు వినాలని కోరారు. చెల్లింపుదార్లు కూడా తమ వివరాలను కూ లంకషంగా వివరించాలన్నారు. అన్ని నగరాల్లో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కార్యాలయాలు, బార్ అసోసియేషన్లకు పక్షోత్సవాల గురించి తెలియచేయాలని సిబిడిటి కోరింది. దీని వల్ల క్లైంట్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు.