బిజినెస్

జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: జనాభా నియంత్రణ విధానాలను బాగా పా టించిన రాష్ట్రాలకు ప్రోత్సహించే విధంగా ఆర్థిక సంఘం చర్యలు ఉండాలని , దీని కోసం తాజాగా జనాభా డాటాను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థికశాస్తవ్రేత్తలు కోరారు. 15వ ఆర్థిక సంఘం శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆర్థికవేత్తలు పై అభిప్రాయాన్ని తెలియచేశారు. ఈ సమావేశానికి ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్, ఇంటర్నేషనల్ గ్రోత్ సెంటర్ కంట్రీ డైరెక్టర్ ప్రణబ్ సేన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొ. పామి దువా, ఎన్‌ఐపిఎఫ్‌పి ప్రొఫెసర్ ఎన్‌ఆర్ భానుమూర్తి, ఎఫ్‌ఎస్‌ఐ అధ్యక్షుడు అరవింద్‌విర్మాని, ద్రవ్య విధాన వ్యవహారాల శాఖ ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ సంజీవ్ గుప్తా, పిఎంఇఏసి సభ్యుడు సూర్జిత్ ఎస్ బల్లా, ఐసిఆర్‌ఐఇఆర్ గౌరవ ప్రొఫెసర్ శంకర్ ఆచార్య హాజరయ్యారు. స్థూల ఆర్థిక వ్యవస్థ విధానాల రూపకల్పనలో భాగంగా, పరిమితులకు లోబడి కేంద్ర, రాష్ట్రాలు రుణాలు తెచ్చుకునే విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. జనాభాపై తాజా డాటాను సేకరించాలని, అదే సమయంలో జనాభా నియంత్రణకు మంచి విధానాలను అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిపుణులు కోరారు. ప్రణాళిక సంఘం రద్దు, వస్తు సేవా పన్ను విధానం అమలు, కేంద్రం అమలు చేసే పథకాలపై ఈ సమావేశంలో చర్చించారు.