బిజినెస్

సింగరేణి డైరెక్టర్‌కు జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: సింగరేణి సంస్థలోడైరెక్టర్ హోదాలో పని చేస్తున్న ఎస్ చంద్రశేఖర్ ‘డైరెక్టర్ ఆపరేషన్స్ ఎక్స్‌లెన్స్’ జాతీయ అవార్డు అం దుకున్నారు. ప్రతియేటా జాతీయ స్థాయిలో బ హుకరించే డైరెక్టర్ ఆపరేషన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రముఖ మైనింగ్ అధ్యయన సంస్థ అయిన జియోమైన్‌టెక్ ఈ యేడాది సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స చంద్రశేఖరుకు అందచేసింది. చంద్రశేఖర్‌తో పాటు నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ( ఇండి యా) ప్రభుత్వ సంస్థ సిఎండి శ్రీ ఆచార్య, జియోమైన్ టెక్ నిర్వాహకులు బికె పాండా, డిజిఎంఎస్ అధికారులు పాల్గొన్నారు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో ఈనెల 12 జరిగిన కార్యక్రమంలో బహుమతిని ప్రముఖ మైనింగ్ మేథావి, రచయిత జివి మిశ్రా చేతలమీదుగా అందుకున్నారు. సింగరేణిలో మైనింగ్ రంగానికి చంద్రశేఖర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. మైనింగ్ ఎక్విప్‌మెంట్ - కొత్త టెక్నాలజీ రక్షణ అనే అంశంపై చం ద్రశేఖర్ ప్రసింగించారు. సింగరేణిలో అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్టును మహుకరించ డంపై సంస్థ సీఎండి శ్రీ్ధర్ హర్షం వ్యక్తం చేశా రు. చంద్రశేఖర్‌కు జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల సింగరేణి అధికారులు, ఉద్యోగ సం ఘాల నేతలు ఆయన్ని అభినందించారు.