బిజినెస్

స్కాం వివరాల వెల్లడిలో జాప్యమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 17: నీరవ్ మోదీ, గీతాంజలి గ్రూపు కంపెనీలతో జరిపిన 2 బిలియన్ యుఎస్ డాలర్ల అక్రమ లావాదేవీల వివరాలను స్టాక్ ఎక్చేంజ్‌లకు తెలియపరచడంలో జరుగుతున్న ఆలస్యంపై సెబీ తమను తీవ్రంగా హెచ్చరించిందని పంజా బ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. ఆర్‌బీఐ, సీబీఐలకు చేసిన నివేదికల వివరాలను స్టాక్ ఏక్చేంజ్‌లకు పీఎన్‌బీ పంపడంలో 1-6 రోజుల ఆలస్యం చేసినట్టు సెబీ గుర్తించిం ది. దీనివల్ల పీఎన్‌బీ ఇందుకు సంబంధించిన చాలా నిబంధనలను ఉల్లంఘించనట్లయింది. నీరవ్ మోదీ, గీతాంజలీ గ్రూపు ఇ తర కంపెనీలతో జరిపిన లావాదేవీలకు సంబంధించి గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో పీఎన్‌బీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు పం పిన సమాచారానికి, స్టాక్ ఎక్చేంజ్‌లకు పం పిన సమాచారానికి తేడా ఉందని సెబీ పే ర్కొంది. ఈ వారం మొదట్లో సీబీఐ, నీరవ్‌మోదీ అక్రమాలకు సంబంధించి ముంబ యి కోర్టులో రెండు ఛార్జ్‌షీట్లను దాఖలు చేసింది. పీఎన్‌బీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపేర్లను, బ్యాంకు మాజీ సీఎండీ ఉషా అనంత సుబ్రహ్మణియన్‌లను ఛార్జ్‌షీటులో పేర్కొంది. ఈ అధికార్లు తప అధికారాలను పూర్తిగా దుర్వినియోగం చేశారని సీబీఐ స్పష్టం చేసింది.