బిజినెస్

వడ్డీ రేట్లు పెరగకపోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 17: రానున్న ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంకు పాలసీ రేట్లలో ఏవిధమైన మార్పులు చేయకపోవచ్చు. కాకపోతే మొత్తంమీద ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల పెంపు విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించే అవకాశముందని ఒక నివేదిక వెల్లడించిం ది. గత మార్చిలో 4.28 శాతంగా ఉ న్న ద్రవ్యోల్బణం, ఏప్రిల్ నాటికి 4.58 శాతానికి పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం కేవలం 2.99 శా తం మాత్రమే ఉండేది. కాగా రిజర్వ్ బ్యాంకు తన రెండవ ద్వైమాసిక ద్ర వ్య విధానాన్ని జూన్ 6న ప్రకటించనుంది. ‘పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల నేపథ్యంలో ఆర్‌బీఐ కొంచెం కఠిన వైఖరి అవలంబించి, వడ్డీ రేట్లు పెంచే అవకాశాల ను కొట్టిపారేయలేం. అయితే వేసంగి పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్ర కటించే వరకు, రుతుపవనాలు ప్రా రంభమయ్యేవరకు వేచిచూడటం వ ల్ల ద్రవ్యోల్బణానికి సంబంధించిన మరింత సమాచారం అందుబాటులో కి రాగలదు. అప్పుడు వడ్డీ రేట్లపై నిర్ణ యం తీసుకునే వీలుంటుంది’ అని గోల్డ్‌మ్యాన్ సాచెస్ తన నివేదికలో పేర్కొంది. అందువల్ల ఆర్‌బీఐ పాలసీ రేట్ల పెంపునకు ఆగస్టులో ఉపక్రమించవచ్చు. ఈ ఏడాది బ్యాంకింగ్ రంగంలో (ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు) చోటుచేసుకున్న అవినీతి కారణంగా, 2019 సంవత్సరానికి దేశ జీడీపీని 40 బేసిస్ పాయింట్లు తగ్గించాం. అయితే బ్యాంకింగ్ రంగానికి తిరిగి మూలధన పెట్టుబడులు సమకూర్చడం వల్ల, శక్తివంతమైన సానుకూల ఉద్దీపనలతో, రుణ, పెట్టుబడుల ప్రగతి సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం అట్టడుగున ఉన్న హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం రాబోయే నెలల్లో మరింత పెరుగుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా 2019లో హెడ్‌లైన్ సీపీఐ ద్రవ్యోల్బణం సగటున 5.3 నమోదు కావచ్చు. అయితే ఇటీవల చమురు ధరలు పెరగడం, ఇరాన్ అణు ఒప్పందం నుంచి యుఎస్ తప్పుకోవడం మన హెడ్‌లైన్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వివరించింది.