బిజినెస్

మూడోరోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమయిన మెజారిటీ రాని నేపథ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా మదుపరులు ముందు జాగ్రత్త చర్యగా లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల వరుసగా మూడో రోజు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 239 పాయింట్లు పడిపోయి, 35,149.12 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 58.40 పాయింట్లు తగ్గి, 10,682.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొనడంతో పాటు విదేశీ ఫండ్‌లు తమ పెట్టుబడుల ఉపసంహరణను నిరంతరాయంగా కొనసాగించడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితికి దారితీసింది. సెనె్సక్స్ గురువారం 35,483.62 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, తరువాత మరింత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 35,510.01 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, సెషన్ చివరలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఈ సూచీ 35,087.82 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 238.76 పాయింట్ల (0.67 శాతం) దిగువన 35,149.12 పాయింట్ల వద్ద ముగిసింది. మే 4న 34,915.38 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ ఆ తరువాత ఇంత తక్కువ స్థాయి వద్ద ముగియడం ఇదే మొదటిసారి. నిఫ్టీ కూడా గురువారం 10,777,25- 10,664.50 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 58.40 పాయింట్ల (0.54 శాతం) దిగువన 10,682.70 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, బుధవారంనాటి లావాదేవీల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 699.22 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 229.06 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
గురువారం రంగాల వారీ సూచీలలో ఎఫ్‌ఎంసీజీ అత్యధికంగా 0.90 శాతం నష్టపోయింది. బ్యాంకెక్స్ 0.63 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. మెటల్, పవర్, టెక్నాలజి, ఐటీ రంగాల సూచీలు కూడా పడిపోయాయి. మరోవైపు, కన్స్యూమర్ డ్యూరేబుల్స్ సూచీ 1.37 శాతం, రియల్టీ 0.41 శాతం చొప్పున పెరిగాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ గూడ్స్, చమురు-సహజ వాయువు రంగాల సూచీలు పెరిగాయి.
సెనె్సక్స్ ప్యాక్‌లోని ఐటీసీ అత్యధికంగా 2.43 శాతం నష్టపోయింది. భారతి ఎయిర్‌టెల్ 2.34 శాతం నష్టపోయింది. టాటా స్టీల్ షేర్ల ధర 1.93 శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, యెస్ బ్యాంక్, రిల్, ఎన్‌టీపీసీ, ఆసియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, టీసీఎస్ ఉన్నాయి. మరోవైపు, కోల్ ఇండియా షేర్ ధర 2.53 శాతం పెరిగింది. సన్ ఫార్మా, టాటా మోటార్స్, విప్రో, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకి, ఎస్‌బీఐ కూడా లాభపడ్డాయి.