బిజినెస్

పెరగనున్న కరెంట్ ఖాతా లోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల భారతదేశ కరెంట్ ఖాతా లోటు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మాన్ సాచ్స్ పేర్కొంది.
రానున్న నెలల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరింత పెరగనున్నాయని, ఫలితంగా 2018-19లో భారత్ కరెంట్ అకౌంట్ లోటు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.4 శాతం మేరకు ఉంటుందని గోల్డ్‌మాన్ సాచ్స్ తన నివేదికలో అంచనా వేసింది. 3మా కమాడిటీస్ టీమ్ ఈ వేసవిలోనూ ముడి చమురు ధరల పెరుగుదల కొనసాగుతుందని, ఈ సంవత్సరాంతంలో ధరలు స్వల్పంగా తగ్గుతాయని అంచనా వేసింది.
భారత్ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)ను గతంలో అంచనా వేసిన జీడీపీలో 2.1 శాతం నుంచి ఇటీవల 2.4 శాతానికి పెంచాం2 అని గోల్డ్‌మాన్ సాచ్స్ ఒక రీసెర్చ్ నోట్‌లో పేర్కొంది. 2017 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో భారత్ సీఏడీ జీడీపీలో రెండు శాతానికి (13.5 బిలియన్ డాలర్లకు) పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో సీఏడీ 1.4 శాతం (8 బిలియన్ డాలర్లు)గా ఉండింది. 2014 నవంబర్ నుంచి తొలిసారిగా గురువారం ప్రపంచ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర ఒక బారెల్‌కు 80 డాలర్లకు పెరిగింది. 3ఇటీవలి కాలంలో ముడి చమురు ధరల పెరుగుదలకు ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం తోడయ్యింది. అమెరికా తీసుకున్న ఈ చర్యతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల ద్రవ్యోల్బణం అంచనాలు పెరిగే ముప్పు పొంచి ఉంది. ముడి చమురు ధరలు పది శాతం పెరిగితే, వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం పది బేసిస్ పాయింట్లు పెరుగుతుందనేది మా అంచనా2 అని గోల్డ్‌మాన్ సాచ్స్ తన నివేదికలో పేర్కొంది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం సగటున 5.3 శాతం ఉంటుందని గోల్డ్‌మాన్ సాచ్స్ అంచనా వేసింది.