బిజినెస్

మూడేళ్లలో 24 హెచ్‌పీ, హెచ్‌టీ బావులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 18:వచ్చే మూడేళ్లలో రూ.2000 కోట్లతో 24 హైప్రెషర్ (హెచ్‌పీ) , హైటెన్షన్ (హెచ్‌టీ) బావులను తవ్వనున్నామని ఓఎన్జీసీ ఆన్‌షోర్ డైరక్టర్ సంజయ్‌కుమార్ మెహిత్రా చెప్పారు. 2022 నాటికి దేశం 10 శాతం చమురు దిగుమతులు తగ్గించుకోవాలనే ప్రధానమంత్రి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓఎన్‌జీసీ నిరంతరం కృషిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న, గుర్తించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా నూతన ఆవిష్కరణలను పెంపొందించుకోవడానికి కృషిచేస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్సులో హెచ్‌పీ, హెచ్‌టీ బావులపై రెండు రోజుల సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కృష్ణా జిల్లా నాగాయలంక క్షేత్రంలో అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలు ఉన్నాయన్నారు. ఇక్కడ నాలుగు వెల్స్ తవ్వామని, ఇందులో ఒకకి ఈ నెలాఖరు నాటికి ఉత్పత్తిలోకి వస్తుందన్నారు. మిగిలిన మూడు బావుల 2019 ఫిబ్రవరి నాటికి ఉత్పత్తిలోకి వస్తాయన్నారు. ఈ నెలాఖరు నుంచి ఉత్పత్తిలోకి రానున్న 1జడ్ ఎస్‌టి బావి నుంచి రోజుకు 150 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 45వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికి తీయాలనేది లక్ష్యమన్నారు. 2019 ఫిబ్రవరి నాటికి నాగాయలంక మొత్తం బావులన్నీ ఉత్పత్తిలోకి రానున్నాయన్నారు. వీటి ద్వారా రోజుకు 450 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 1.50 లక్షల స్టాండర్డు క్యూబిక్ మిటర్ల సహజ వాయువు లభించనుందన్నారు. నాగాయలంక బావులు అత్యధిక పీడన, అధిక ఉష్ణోగ్రత కలిగిన బావులన్నారు. ప్రస్తుతం రోజుకు 850 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 34 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తవుతోందన్నారు. ఓఎన్జీసీ కేజీ బేసిన్ అసెట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ చమురు, సహజవాయు ఉత్పత్తికి ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా నగరం గెయిల్ దుర్ఘటన తర్వాత ఇప్పటి వరకు 850 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్ వేశామన్నారు.

చిత్రం..విలేఖర్లతో మాట్లాడుతున్న ఓఎన్జీసీ ఆన్‌షోర్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ మెహిత్రా