బిజినెస్

సోలార్ ప్రాజెక్టుల వేలం మరింత ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జరగనున్న సోలార్ ప్రాజెక్టుల వేలం మరింత ఆలస్యం కానుంది. 2000 ఎండబ్ల్యు సోలార్ ప్రాజెక్టుల వేలంలో అంతర్ రాష్ట్రాల అనుసంధానం విషయంలో తీర్మానం కావాలని బిడ్‌లో పాల్గొంటున్న కంపెనీలు కోరుతున్నాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు వేలంకు సంబంధించి బిడ్ ఈనెల 21న జరగాల్సి ఉంది. అయితే పవర్ అనుసంధానంపై అంతర్‌రాష్ట్ర సమస్యలు తలెత్తవచ్చునని అందుకు బిడ్‌ను జూన్ మొదటివారానికి వాయిదా వేయాలని సోలార్ పవర్ డెవలపర్స్ అసోసియేషన్ మినిస్ట్రీకి లేఖ రాసింది. అంతర్‌రాష్ట్ర ప్రసార విధానం ఇంకా పూర్తికాలేదని వారు పేర్కొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఇ, ఎస్‌ఇసిఐ ప్రతినిధులతో గత వారం జరిగిన సమావేశంలో పవర్ రెగ్యులేటర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మే 15నే అంతర్ రాష్ట్ర ప్రసార విధానానికి అనుమతిని మంజూరు చేసింది. అయితే దీనిపై బిడ్డర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వం 2022 నాటికి 100 జిడబ్ల్యు సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులను వేలం వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా 2018-19, 19-20 సంవత్సరానికి 60 జిడబ్ల్యు సోలార్ ఎనర్జీలను మాత్రమే వేలం వేసింది.