బిజినెస్

ఉజల పథకం ద్వారా 30 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజల పథకం కింద ఇప్పటివరకు దేశంలో 30 కోట్ల ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేసినట్టు ఎనర్జీ ఎఫీషియంట్ సర్వీసెస్ లిమిటెట్ (ఇఇఎస్‌ఎల్) వెల్లడించింది. జనవరి 2015లో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన దీని ద్వారా ఇన్ని కోట్ల బల్బులను పంపిణీ చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద పథకంగా నిలుస్తుందని అన్నారు. ఇన్ని బల్బుల పంపిణీతో దేశంలో 38,952 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ప్రతిఏడాది ఆదా అవుతుందని, దీనివిలువ 15,581 కోట్లని ఇఇఎస్‌ఎల్ ఎండి సౌరబ్‌కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా 2005 నుంచి 2030 వరకు కార్బన్ తీవ్రత 33 నుంచి 35 శాతం తగ్గించాలన్నది లక్ష్యమన్నారు. ఈ పథకాన్ని నిరంతరంగా కొనసాగించం ద్వారా గృహావసరాలకు చక్కని కాంతిని ఇవ్వడమే కాక, విద్యుత్‌ను ఆదా చేయగలుగుతామని అన్నారు. అలాగే ఎల్‌ఇడి బల్బుల పంపిణీ ద్వారా గ్లోబల్ మార్కెట్‌లోని భారత్ షేర్ 0.1 నుంచి 12 శాతానికి పెరిగిందని అన్నారు. ఎల్‌ఇడి దేశీయ మార్కెట్ సైతం 0.4 శాతం నుంచి 10 శాతానికి పెరిగిందని అన్నారు.
ఎల్‌ఇడి గృహావసర ఉత్పత్తులు 30 లక్షల నుంచి ఆరుకోట్లకు చేరిందని, దీనిద్వారా 60 వేల ఉద్యోగాలు కూడా లభించాయని సౌరబ్‌కుమార్ వివరించారు.