బిజినెస్

దెబ్బతీసిన కర్ణాటక అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 19: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బాగా నష్టపోయాయి. మార్కెట్ కీలక సూచీలు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 687.49 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 210.10 పాయింట్ల చొప్పున పడిపోయాయి. ఈ రెండు సూచీలు వరుసగా మదుపరుల నుంచి కీలక మద్దతు లభించే స్థాయిలు 35,000 పాయింట్లు, 10,600 పాయింట్ల కన్నా దిగువకు దిగజారి, 34,848.30, 10,596.40 పాయింట్ల వద్ద ముగిశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి స్పష్టమయిన మెజారిటీ రాకపోవడంతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్థూలార్థిక గణాంకాలు కూడా ఈ వారం లావాదేవీలలో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు అయిదు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, వినియోగ వస్తువుల ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రెండూ కూడా పెరగడం, అన్నిటికీ మించి ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా ఒక బారెల్‌కు 80 డాలర్ల స్థాయికి పెరగడం వంటి పరిణామాల వల్ల కీలక సూచీలపై బేర్ పట్టు బిగించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమయిన మెజారిటీ సాధించడంలో బీజేపీ విఫలం కావడం, తరువాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనడం వంటి పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ వారం ప్రపంచ పరిణామాలు కూడా స్టాక్ మార్కెట్‌కు మద్దతుగా నిలిచేవిగా లేవు. అమెరికా-చైనా వాణిజ్య వివాదం పరిష్కారంలో ప్రగతి కొరవడటం, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగడం, పదేళ్ల అమెరికా ట్రెజరీ నోట్‌పై ఆదాయం ఏడేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 3.09 శాతానికి పెరగడం వంటి పరిణామాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెనె్సక్స్ ఈ వారంలో 35,555.83 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 35,993.53- 34,821.62 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 687.49 పాయింట్ల (1.93 శాతం) దిగువన 34,848.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం వారంలో 620.41 పాయింట్లు పుంజుకుంది.
నిఫ్టీ ఈ వారంలో 10,815.15 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 10,929.20- 10,589.10 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 210.10 పాయింట్ల (1.94 శాతం) దిగువన 10,596.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు రెండూ కూడా ఈ వారం పడిపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో, పీఎస్‌యూ లు, మెటల్, చమురు- సహజ వాయువు, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకెక్స్, ఐపీఓలు, పవర్, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, స్థిరాస్తి, టెక్ రంగాల షేర్లు నష్టపోయాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ. 660.56 కోట్ల షేర్లను విక్రయించారు.