బిజినెస్

ఉక్కు, అల్యూమినియంపై భారీ సుంకాలేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై దిగుమతి సుంకాలను విధించడాన్ని భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు చెందిన వివాదాల పరిష్కార యంత్రాంగం వద్ద సవాలు చేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై ప్రభావం చూపుతుందని, పైగా ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య సూత్రాలకు అనుగుణంగా లేదని భారత్ పేర్కొంది. ‘అమెరికా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను విధించడంపై డబ్ల్యూటీకు ఫిర్యాదు చేశాం’ అని ఒక అధికారి తెలిపారు. అమెరికా విధించిన దిగుమతి సుంకాలపై డబ్ల్యూటీవోకు చెందిన వివాదాల పరిష్కార యంత్రాంగం పరిధిలో ఆ దేశంతో సంప్రదింపులు జరపాలని కోరుకుంటున్నట్టు భారత్ తెలిపింది. వివాద పరిష్కార ప్రక్రియలో తొలి మెట్టు సంప్రదింపులు జరపాలని కోరడం. ఈ సంప్రదింపులలో రెండు దేశాలు పరస్పర అంగీకారంతో ఒక పరిష్కారాన్ని కనుగొనలేకపోతే, అప్పుడు భారత్ ఈ అంశాన్ని సమీక్షించవలసిందిగా డబ్ల్యూటీవో వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని కోరవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 9వ తేదీన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలను విధించారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్య ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. కెనడా, మెక్సికో మినహా అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్ ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై పది శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తూ ట్రంప్ రెండు ఆదేశాలు జారీ చేశారు. ఈ భారీ దిగుమతి సుంకాల నుంచి తనకు కూడా మినహాయింపు ఇవ్వాలని భారత్ ఇదివరకే అమెరికాను కోరింది.