బిజినెస్

ఆడిట్ వివరాలు ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: రూ. 13 వేల కోట్ల కుంభకోణం సంగతి బయటపడటానికి కారణమైన ఆడిట్ లేదా విచారణ వివరాలను వెల్లడించడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు తిరస్కరించింది. ఆవిధంగా వెల్లడించడం వల్ల విచారణ పురోగతిని లేదా నేరస్థులను పట్టుకోవడానికి అవరోధం ఏర్పడుతుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నిబంధనలోని క్లాజ్ ను వివరించింది. సమాచార హక్కు కింద వివరాలు కోరుతూ దాఖలైన ద రఖాస్తుకు సమాధానమిస్తూ, స్కాం కు సంబంధించిన విచారణ కాపీని అందించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసు కేంద్ర విచారణ సంస్థలు విచారణలో ఉన్నందువల్ల, సమాచారహక్కు చట్టం-2005, సెక్షన్ 8(1) ప్రకారం కావలసిన సమాచారాన్ని అందించడం సాధ్యంకాదని పేర్కొంది. ఇప్పటికే ఈ కుంభకోణం పై సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆర్‌బీఐలు వి చారణను ప్రారంభించాయి. వివిధ బ్యాంకుల ఆడిట్‌లను నిర్వహించబోనని, కేవలం నష్టస్థాయిని బట్టి పర్యవేక్షిస్తామని ఆర్‌బీఐ ‘చట్ట పారదర్శకతపై’ ఒక ప్రశ్నకు సమాధానంగా చె ప్పింది. ఈ నేపథ్యంలో పదేళ్లకాలం లో బ్యాంకులో జరిపిన తనిఖీల వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది. అయి తే త నిఖీలు నిర్వహించిన తేదీలు అందుబాటులో లేవంది. తనిఖీలకు సంబంధించిన నివేదికల కాపీలు ఇ వ్వాల్సిందిగా ఆర్‌టీఐ కార్యకర్త కోర గా, చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వాటిని ఇవ్వడం సాధ్యం కాదని పే ర్కొంది. ఆర్‌టీఐ చట్టం కింద అడిగిన మరిన్ని ప్రశ్నలకు సమాధానాలకోసం వాటిని పీఎన్‌బీకి ఫార్‌వర్డ్ చేసింది. ఇ దిలావుండగా ఈవారం మొదట్లో సీబీ ఐ ముంబై కోర్టులో పీఎన్‌బీ స్కాంకు సంబంధించి రెండు ఛార్జ్‌షీట్లు దాఖ లు చేసింది. కొన్ని క్రెడిట్ గ్యారంటీల పై, పీఎన్‌ఫీ, రిజర్వ్ బ్యాం కును త ప్పుదోవ పట్టించిందని సీబీఐ తన ఛార్జ్‌షీటులో ఆరోపించింది.