బిజినెస్

పీఎన్‌బీకి జరిమానా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ఇటీవల బయటపడిన భారీ కుంభకోణం నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు, గీతాంజలీ జెప్స్ సంస్థలపై పెద్ద ఎత్తున జరిమానా విధించాలని సెబీ యోచిస్తోంది. అనుమానాస్పద లావాదేవీలు ఇతర అంశాలపై విచారణ జరిపిన తర్వాత రూ. 14వేల కోట్ల విలువైన ఈ బ్యాంకింగ్ కుంభకోణంపై విచారణ తర్వాత పై చర్య తీసుకోవాలన్నది సెబీ ఆలోచన. దేశంనుంచి తప్పించుకు పారిపోయిన నీరవ్ మోదీ, గీతాంజలీ గ్రూప్ అఫ్ కంపెనీలతో నిర్వహించిన తప్పడు లావాదేవీలకు సంబంధించిన వివరాలను తెలియపరచడంలో ఆలస్యం చేస్తున్నందుకు గత వారం సెబీ, పంజాబ్ నేషనల్ బ్యాంకును హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విచారణ ఫలితాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని అధికార్లు వెల్లడించారు. కొంతమంది బ్యాంకు అధికార్ల సహాయంతో నీరవ్ మోదీ తప్పుడు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓయూ), ఫారెన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ)లను సృష్టించి పంజామ్ నేషనల్ బ్యాంకును మోసగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీలు నిర్వహించిన స్టాక్ మార్కెట్ ట్రేడ్ వివరాలను సెబీ విశే్లషిస్తోంది. ఇప్పటికే వీరు బ్రోకరేజ్ డీఫాల్ట్ ఇన్సిడెంట్‌తో సహా వివిధ కేసుల్లో నిఘా నీడలో ఉన్నారు. నిజానికి ట్రేడింగ్ విషయంలో సెక్యూరిటీ మార్కెట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గీతాంజలీ జమ్స్ అండ్ చోస్కీని 2013లో నిఫ్టీ, సెబీని సంప్రదించిన తర్వాత డిబార్ చేసింది. తర్వాత వీరి లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు విచారణ జరిపాయి. ఇదిలావుండగా వివిధ కంపెనీలు షేర్ల ధరలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సెబీకి తెలియపరుస్తుండాలి. అయితే ఈ వివరాలను ఇవ్వడంలో పీఎన్‌బీ 1-6 రోజులు ఆలస్యం చేయడం సెబీ ఆగ్రహానికి కారణం.