బిజినెస్

చమురు ధరలే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 20: ఎస్‌బీఐ, సిప్లా వంటి బ్లూచిప్ కంపెనీలు నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఆర్జించిన లాభాలతో పాటు ముడి చమురు ధరల కదలిక, ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటుపై దాని ప్రభావం సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. కర్ణాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి దరిమిలా శనివారం విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ముందే మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న యెడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయడం వంటి పరిణామాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై స్వల్పకాలం పాటే ఉంటుందని వారు పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికీ మెజారిటీ రాకుండా వెలువడిన ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఎక్కువ కాలం ఉండబోదని అంచనా వేశారు. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం చివరలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీల ఎన్నికలు జరిగేంత వరకు స్టాక్ మార్కెట్ ధోరణిని రాజకీయాలకన్నా ఆర్థికాంశాలే ఎక్కువగా నిర్దేశిస్తాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. తక్షణమే స్టాక్ మార్కెట్‌ను ఆందోళనకు గురిచేసే అంశాలు బారెల్‌కు 80 డాలర్ల వరకు పెరిగిన ముడి చమురు ధర, వడ్డీ రేటు, మారకం రేటు, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అని ఆయన వివరించారు. స్థూలార్థిక గణాంకాలు అననుకూలంగా మారడంతో పాటు ముడి చమురు ధరలు పెరగడం వల్ల స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పుంజుకోవడం నిలిచిపోయింది. ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ బారెల్‌కు 85 డాలర్ల వరకు చేరితే, అప్పుడు స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు జోరుగా సాగుతాయి. లేకపోతే, స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతూ కీలక సూచీలు విస్తృత పరిధిలో కదులుతుంటాయని ఆయన వివరించారు. కొంతకాలంగా పెరుగుతున్న ముడి చమురు ధర, బాండ్‌లపై ఆదాయాలు, డాలర్ విలువ మార్కెట్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) పాలసీలను ఇవి ప్రభావితం చేస్తాయి. ముడి చమురు ధరలు మరింత పెరిగినా లేక బాండ్‌లపై ఆదాయాలు పెరిగినా అది స్టాక్ మార్కెట్‌కు ప్రతికూలంగా పరిణమిస్తుందని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పరిశోధనా విభాగం వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు. వచ్చే వారం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) మినట్స్, అమెరికా ఉద్యోగ గణాంకాల వైపు మదుపరులు చూస్తున్నారని స్టాక్ మార్కెట్ మరో నిపుణుడు పేర్కొన్నారు. వచ్చే వారం కొన్ని కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నందున మదుపరులు ఆయా స్టాక్‌లను బట్టి నిర్ణయం తీసుకునే ధోరణి నెలకొని ఉంటుందని ఆయన తెలిపారు. వచ్చే వారం తమ నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్న పెద్ద కంపెనీలలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఎస్‌బీఐ, జెట్ ఎయిర్‌వేస్, టాటా మోటార్స్, గెయిల్ వంటివి ఉన్నాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 687.49 పాయింట్లు (1.93 శాతం) పడిపోయి, 34,848.30 పాయింట్ల వద్ద ముగిసింది.