బిజినెస్

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతికి ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వశాఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా వచ్చే జూన్‌లో ప్యాకేజీలను ప్రకటించనుంది. ఇందుకోసం కొత్త జాతీయ ఎలక్ట్రానిక్ పాలసీని అమల్లోకి తీసుకురానున్నది. దీని ద్వారా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి, ఈజ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు సీనియర్ అధికారి తెలిపారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ నేతృత్వంలోఏర్పాటైన కమిటీ, ‘డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్’ను రూపొందిస్తోంది. జూన్ నెలాఖరు నాటికి ఇది పూర్తికాగలదు. ఈ సరికొత్త ఎలక్ట్రానిక్ విధానంలో ఎగుమతు విధానాలను మరింత సరళీకృతం చేస్తారు. దీనివల్ల ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను నిరాటంకంగా ఎగుమతులు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. అమ్మకం జరిపిన ఎలక్ట్రానిక్ వస్తువుల, మరమ్మతు లేదా సర్వీసింగ్ చేపట్టడానికి నియమిత కాలావధిని పెంచే విషయంలోప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ‘మన తయారీదార్లు అమ్మకం జరిపిన ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతులు లేదా సర్వీసులకు కేవలం మూడేళ్ల వరకు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత మరమ్మతులు లేదా సర్వీసులకోసం ఇక్కడికి తీసుకొని రావడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల కింద చాలా కష్టం. అందువల్ల ఈ కాలావధిని పెంచేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి’ అన్నారు. ఇక దేశీయ అవసరాలకోసం తయారుచేసే ఎలక్ట్రానిక్ వస్తువులను మరింత పోటీపడగల స్థాయిలో రూపొందించడానికి ఈ కొత్త విధానం వీలు కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న నూతన ఎలక్ట్రానిక్ విధానం మరింత విస్తృత ప్రాతిపదికన ఉంటుందని, దీన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోగానే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తయారీదారుల్లో పోటీతత్వాన్ని అడ్డుకుంటున్న అంశాలను తొలగించడానికే ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు.