బిజినెస్

ఉత్పత్తి రెట్టింపు చేయడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 22: దేశంలో ఈ ఏడాది చమురు, సహజవాయు అనే్వషణకు రూ.35 వేల కోట్లు ఖర్చు చేశామని ఓఎన్జీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శశిశంకర్ చెప్పారు. దేశీయంగా ఉత్పత్తులు పెంచి దిగుమతులు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వచ్చే రెండు మూడేళ్లలో చమురు, సహజ వాయు ఉత్పత్తులు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. కేజీ బేసిన్‌లో అపార చమురు సహజవాయు నిక్షేపాల గనిగావున్న నాగాయలంక క్షేత్రంలో పునరుద్ధరించిన తొలి బావి నుంచి ఉత్పత్తులను ప్రారంభించడానికి మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన శశిశంకర్ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్సులో ఈడీ, అసెట్ మేనేజర్ డీఎంఆర్ శేఖర్‌తో కలిసి విలేఖర్లతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా తమ సంస్థ చమురు, సహజవాయువు ఉత్పత్తిచేసే బావుల సంఖ్య ఈ ఏడాది 503కి పెరిగిందన్నారు. నాగాయలంక క్షేత్రంలో భారీగా చమురు, సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయని, దీంతో కేజీ బేసిన్ ఆన్‌షోర్‌లో వచ్చే ఏడాదికి చమురు, సహజ వాయు ఉత్పత్తి గణనీయంగా పెరగనుందన్నారు. డీప్‌వాటర్‌లో ఉత్పత్తి వచ్చే ఏడాది మొదలవుతుందన్నారు. ప్రస్తుతమున్న 24 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తిని రానున్న రెండు మూడేళ్లలో 50 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెంచనున్నామన్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు ఎంఎంటీఎస్‌ల చమురు ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఈస్ట్‌కోస్ట్‌పై దృష్టి కేంద్రీకరించామన్నారు. ప్రస్తుతం ఓఎన్జీసీకి అనుబంధ సంస్థలుగా ఉన్న హెచ్‌పీసీఎల్, మంగుళూరు రిఫైనరీ పెట్రో లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్)ను ఓఎన్జీసీలో విలీనంచేసే ప్రక్రియ మొదలైందన్నారు. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌లో ఓఎన్జీసీకి 51.4 శాతం వాటా ఉందన్నారు.
దేశ వ్యాప్తంగా చమురు, సహజ వాయు ఉత్పత్తిలో ఓఎన్జీసీ వాటా 70 శాతంగా ఉందన్నారు. చెన్నై కేంద్రంగానే కావేరి, కేజీ బేసిన్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దేశీయంగా అవసరమైన చమురులో దిగుమతులు 80 శాతం ఉండగా, మిగిలిన 20 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోందని, ఇందులో 70 శాతం ఓ ఎన్జీసీ ఉత్పత్తి చేస్తోందన్నారు.
విదేశాల్లో సైతం ఓఎన్జీసీ కార్యకలాపాలు ముమ్మరం చేశామన్నారు. ఇందులో భాగంగా అబుదబిలో ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టామన్నారు. ఆ దేశంలో 10 శాతం ఓఎన్జీసీకి షేర్లు ఉన్నాయన్నారు. ఓఎన్జీసీ మొత్తం 19 దేశాల్లో 40 ప్రాజెక్టులు నిర్వహిస్తోందన్నారు.
ఓఎన్జీసీ కార్యకలాపాలు జరిగే చోట కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద ఏడాదికి రూ.64 కోట్ల నిధులు సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నామని సీఎండీ శశిశంకర్ తెలిపారు. ఏటా ఆన్‌షోర్ చమురు, సహజ వాయు ఉత్పత్తులపై రూ.352 కోట్లు రాయల్టీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని ఆయన వివరించారు.