బిజినెస్

‘బ్రెగ్జిట్’కు బెదరని మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 23: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని భావిస్తున్న బ్రెగ్జిట్‌పై ఓ వైపు రెఫరెండం కొనసాగుతున్నప్పటికీ దీనికి వ్యతిరేకంగానే తీర్పు రావచ్చన్న తాజా సంకేతాల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లు ఊహించని విధంగా లాభాల బాటలో సాగాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 237 పాయింట్లు లాభపడి మళ్లీ 27 వేల పాయింట్ల మార్క్‌ను దాటింది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌ను వదిలిపెట్టే అవకాశాలు లేవని మదుపరులు భావించడంతో ఐరోపాతో వ్యాపార సంబంధాలు కలిగిన దేశీయ కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి. తన రాబడిలో అధిక భాగం బ్రిటన్‌నుంచి పొందే టాటా మోటార్స్ షేరు 3.28 శాతం పెరిగింది. భారత్ ఫోర్జ్, హిందాల్కో, ఇన్ఫోసిస్ షేర్లు సైతం 2 శాతానికి పైగా లాభపడ్డాయి. డాలరుతో రూపాయి 24 పైసల మేర లాభపడ్డం కూడా మార్కెట్ ఉత్సాహానికి ఊతమిచ్చింది. ఉదయంనుంచి మధ్యాహ్నం దాకా కూడా పెద్దగా కొనుగోళ్లు, అమ్మకాలు లేక మార్కెట్లు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఐరోపా మార్కెట్లలో లావాదేవీలు ప్రారంభం కాగానే ఒక్కసారిగా పుంజుకోవడం ప్రారంభించాయి. ప్రధాన ఐరోపా మార్కెట్లన్నీ ప్రారంభంలోనే లాభాల్లో సాగడం దీనికి ప్రధాన కారణం. దీంతో సెనె్సక్స్ మళ్లీ 27 వేల పాయింట్లను దాటిపోయి ఒక దశలో 27,060.98 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. చివరికి 236.57 పాయింట్ల లాభంతో 27,002.22 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నెల 2వ తేదీ తర్వాత సెనె్సక్స్ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 66.75 పాయింట్లు పెరిగి 8,270.45 పాయింట్ల వద్ద ముగిసింది. రెఫరెండం జరుగుతున్న బ్రిటన్‌తో పాటుగా ఫ్రాన్స్, జర్మనీలాంటి ప్రధాన సూచీలు సైతం లాభాల బాటలో సాగాయి. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, సింగపూర్ సూచీలు లాభాల్లో ముగియగా, చైనా, దక్షిణ ఒరియా, తైవాన్ సూచీలు నష్టాలు చవిచూశాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 24 షేర్లు లాభాల్లో ముగియగా, ఎన్‌టిపిసి, సిప్లా, టిసిఎస్, ఒఎన్‌జిసి, హీరోమోటోకార్ప్, టాటా స్టీల్ షేర్లు మాత్రం నష్టాలతో ముగిశాయి.