బిజినెస్

మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 22: అయిదు వరుస సెషన్ల నష్టాలకు తెరదించుతూ మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. మార్కెట్ కీలక సూచీలు స్వల్పంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 35 పాయింట్లు పెరిగి 34,651.24 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం అనిశ్చితిలో సాగిన మార్కెట్ లావాదేవీలలో మదుపరులు ఇటీవల ధరలు పడిపోయిన వాహన, లోహ, బ్యాంకింగ్, స్థిరాస్తి రంగాల షేర్లను ఎక్కువగా కొనుగోలు చేయడంతో కీలక సూచీలు పుంజుకున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదంపై నెలకొన్న ఉద్రిక్తతలు సడలడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఆసియా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. సెనె్సక్స్ మంగళవారం అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, మరింత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 34,754.60 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, తరువాత అనిశ్చితిలో పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 35.11 పాయింట్ల (0.10 శాతం) ఎగువన ముగిసింది. కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో పాటు ప్రపంచ పరిణామాలు ప్రతికూలంగా ఉండటం వల్ల ఈ సూచీ క్రితం అయిదు సెషన్లలో కలిసి 940.58 పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ మంగళవారం 10,558.60- 10,490.55 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 20 పాయింట్ల (0.19 శాతం) ఎగువన 10,536.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. మొండి బకాయిల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ నాలుగో త్రైమాసికంలో రూ. 7,718 కోట్ల నష్టాలను చవిచూసినప్పటికీ, మంగళవారం స్టాక్ మార్కెట్‌లో దాని షేర్ ధర 3.69 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, సోమవారం నాటి లావాదేవీలలో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 1,190.56 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 496.03 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
మంగళవారం నాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని డాక్టర్ రెడ్డీస్ అత్యధికంగా 6.30 శాతం లాభపడింది. బజాజ్ ఆటో 3.86 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో టాటా మోటార్స్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, హీరో మోటోకార్ప్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, విప్రో, టాటా స్టీల్ ఉన్నాయి. మరోవైపు, టీసీఎస్, ఆసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, పవర్ గ్రిడ్, అదాని పోర్ట్స్, కోటక్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, రిల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నష్టపోయాయి.