బిజినెస్

ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని పటిష్టం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళూరు, మే 22: రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే తప్పనిసరిగా ఫుడ్ ప్రోసెసింగ్ రంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్రం ఉందన్నారు. అసోచామ్ అనే వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆహార ప్రోసెసింగ్ రంగం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను అమలు చేయాలన్నారు. లేని పక్షంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేమన్నారు. వినియోగదారులకు పరిశుద్ధమైన ఆహారాన్ని ఇవ్వాలన్నారు. దీని వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటుధరలను కల్పించాలన్నారు. గత ఏడాది నవంబర్ నెలలో భారత్‌లో ప్రపంచ ఆహారంపై నిర్వహించిన సదస్సు సందర్భంగా మన దేశం రూ. 31వేల కోట్ల పెట్టుబడులను సాధించినట్లు చెప్పారు. ఆహార ప్రోసెసింగ్ పరిశ్రమతో రైతుల ఉత్పత్తులను అనుసంధానం చేయాలన్నారు. చివరకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు వినియోగదారులకు చేరాలని, అప్పుడే రైతాంగం సంక్షోభం నుంచి తేరుకుంటుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆహార ఉత్పత్తుల నిల్వకు 14 కోల్డ్ చైన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా శీతల గిడ్డంగుల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించామని, ఇంతవరకు 40 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులను పంపే ప్రక్రియ వివిధ రాష్ట్రాల్లో చురుకుగా కొనసాగుతున్నట్లు చెప్పారు.