బిజినెస్

సహజ నిక్షేపాల వెలికితీతలో ఓఎన్‌జీసీదే ప్రధాన భూమిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక: భారతదేశంలో సహజ సిద్ధ నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయటంలో ఓఎన్‌జీసీ ప్రధాన భూమిక పోషిస్తోందని ఆ సంస్థ సీఎండీ, ఓఎన్‌జీసీ గ్రూ ప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ శశిశంకర్ అన్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్రామ సమీపంలో ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో ఆయిల్ నిక్షేపాల వెలికితీత కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శశిశంకర్ మాట్లాడుతూ గత డిసెంబర్‌లో ఈ ప్రాంతంలో సహజ వాయువుల వెలికితీత పనులకు సంబంధించి తమ సంస్థ చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తవటమే గాక గ్యాస్‌తో కూడిన ఆయిల్ నిక్షేపాలు ఉత్పత్తి ప్రక్రియ వే గవంతం కావడానికి కృషి చేసిన తమ సంస్థ అధికారులు, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తమ సంస్థ దేశంలోని పలు ప్రాంతాలలో సహజ వాయువుల వెలికితీతకు సం బంధించి పరిశోధనలు జరుపుతూనే ఉంటుందన్నారు. దేశ అవసరాలకు కావల్సిన సహజ వాయువుల ఉత్పత్తి కి కృషి చేస్తుందన్నారు. నాగాయలం క ప్రాంతంలో ఓఎన్‌జీసీ కార్యక్షేత్రం పరిసరాల్లో గల గ్రామాల్లో నివశిస్తు న్న ప్రజల సమస్యల వివరాలను స్థా నిక ప్రజాప్రతినిధులు, అధికారులు తమ దృష్టికి తెస్తే తగు విధంగా సహకారం అందజేస్తామని శశిశంకర్ హా మీ ఇచ్చారు. బందరు పార్లమెంట్ స భ్యుడు కొనకళ్ల నారాయణరావు మా ట్లాడుతూ రాష్ట్రంలో ఓఎన్‌జీసీ సేకరించే సహజ నిక్షేపాలను రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు తొలి ప్రాధాన్యం ఇ చ్చిన తదుపరి మిగిలిన ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తదుపరి నవ్యాంధ్రప్రదేశ్ పలు రంగాలలో వెనుకబడి ఉందని, ఈ దృష్ట్యా సహజ వాయువుల ఉత్పత్తికి కారణభూతమవుతున్న ఈ ప్రాంత అ వసరాలను తీర్చాల్సిన నైతిక బాధ్యత ఓఎన్‌జీసీపై ఎంతైనా ఉందన్నారు. ఓ ఎన్‌జీసీ రాష్ట్రంలో చేపడుతున్న పనులకు సంబంధించి ముఖ్యమంత్రి నా రా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అనుమతులను తీసుకురావటంలో ప్రము ఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. తొలుత ఆయిల్ రిగ్గింగ్ పనులను శశిశంకర్ ప్రారంభించగా ఆయిల్ ట్యాంకర్‌ను ఎంపీ నారాయణరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన ప్రారంభ శిలాఫలకాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్‌జీసీ మేనేజ్‌మెంట్ కమి టీ మెంబర్ ఫంకజ్ జెయిన్, ఓఎన్‌జీసీ ఈడీ డిఎంఆర్ శేఖర్, న్యూఢిల్లీలోని ఆంధ్రాభవన్ రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ తదితరులున్నారు.