బిజినెస్

మైనారిటీ వాటాదారులకు రూ. 100 కోట్లు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూర్, మే 23: కోయంబత్తూరుకు చెందిన ఎస్‌వి గ్లోబల్ మిల్ మెజార్టీ వాటాదారులు, మైనార్టీ వాటాదారులకు రూ. 100కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బిన్నీ కంపెనీ నుంచి బిన్నీ మిల్స్, ఎస్‌వి గ్లోబల్ మిల్ గతంలోనే విడిపోయాయి. అసలు కంపెనీలో మైనార్టీ వాటాలను ఎస్ నటరాజన్ అనే ప్రమోటర్ కలిగి ఉన్నారు. ఎస్‌వి గ్లోబల్ మిల్ ఈ సంస్థను కొనుగోలు చేసేందుకుగాను నటరాజన్ అసోసియేట్స్‌కు రాజ్యాంగంలోని 142వ అధికరణానికి లోబడి రూ. 100 కోట్లను చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతకు ముందు మద్రాసు హైకోర్టు ఇదే తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఎఎం సాప్రేతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మొత్తం కంపెనీలో మైనార్టీ వాటాలు 42.36 లక్షలు ఉన్నాయి. ఇవి కంపెనీ మొత్తం వాటాలో 19 శాతం. కోర్టు ఆదేశాలు అందినప్పటి నుంచి తొమ్మిది నెలల్లోగా ఈ వాటాలను కొనుగోలు చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కంపెనీలో మైనార్టీ వాటాదారుడు నటరాజన్ ప్రమోటర్లలో నెలకొన్న తగాదాలపై పరిష్కారం నిమిత్తం కంపెనీ లా బోర్డును 2014 సెప్టెంబర్‌లో ఆశ్రయించారు. తనను డైరెక్టర్‌గా నియమించాలన్న తీర్మానంతో ఇతర ప్రమోటర్లు ఏకీభవించకపోవడంతో కోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన కంపెనీ లా బోర్డు కంపెనీలో ఎక్కువ వాటాలు కలిగి ఉన్న ఎం ఇథిరాజ్, ఇ షణ్ముగంలు మైనార్టీ వాటాదారుడు నటరాజన్ వాటాలను కొనుగోలు చేయాలని ఆదేశించింది. మద్రాసు హైకోర్టులో ఈ కేసు నడిచింది. మైనార్టీ వాటాదారుడికి వంద కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా, మెజార్టీ వాటాదారులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 2012లో బిన్నీ లిమిటెడ్ నుంచి బిన్నీ మిల్స్, ఎస్‌వి గ్లోబల్ మిల్ విడిపోయాయి. 2013లో ఈ మూడు కంపెనీల వాటాలను లిస్టు చేశారు. ఎస్‌వి గ్లోబల్ మిల్‌కు చెన్నై, బెంగళూరులో ప్రధానమైన ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. చెన్నైలో అర్మీనియన్ స్ట్రీట్‌లో 2.05 ఎకరాలు, అప్‌స్టేల్ బోట్ క్లబ్ రోడ్డు ఏరియాలో 1.44 ఎకరాల స్థలం. కాంచీపురం వద్ద 75 ఎకరాలు, బెంగళూరులో రెండు వేరువేరు ప్రాంతాల్లో 28 ఎకరాల భూములు ఉన్నాయి.