బిజినెస్

ఫ్లోరిడాకు టీసీఎస్ కార్యకలాపాల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: ప్లోరిడాలో తన కార్యకలాపాలను ప్రారంభించినట్టు దేశంలోని అతిపెద్ద ఐటీ సర్వీసెస్ సంస్థ టీసీఎస్ బుధవారం వెల్లడించింది. అమెరికాకు చెందిన ఫ్లోరిడాలో 430 ఉద్యోగులతో సంస్థను ప్రారంభించామని తెలిపింది. ట్రాన్స్‌అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ కంపెనీ ప్రారంభించామని వివరించింది. గత జనవరిలో టీసీఎస్, ట్రాన్స్‌అమెరికా సంస్థతో 2బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకాలు చేసింది. దీని ప్రకారం ఆ సంస్థకు చెందిన జీవిత బీమా, వార్షిక, అనుబంధ ఆరోగ్య బీమా, పనిప్రదేశాల్లో వాలంటరీ ప్రయోజన ఉత్పత్తులు వంటి వాటి పాలనా వ్యవహారాలను నిర్వహించేందుకు టీసీఎస్ అంగీకరించింది. దీనివల్ల పదివేల మిలియనల్ల పాలసీలను టీసీఎస్ నిర్వహించాల్సి వస్తుంది.
ఇదే సమయంలో ట్రాన్స్‌అమెరికాకు చెందిన 430 మంది గత ఉద్యోగులను, కొత్త సెంట్ పీటర్స్‌బర్గ్ ఫెసిలిటీలో నియమించింది. యుఎస్‌లోని వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్‌అమెరికా సంస్థకు చెందిన వివిధ శాఖల్లో 2,200 ఉద్యోగాలపై పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సెంట్‌పీటర్స్‌బర్గ్‌లోని ట్రాన్స్‌అమెరికాకు చెందిన భవనంలో అనేక అంతస్తులను టీసీఎస్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది.