బిజినెస్

రికార్డు స్థాయికి చమురు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం రికార్డు స్థాయికి చేరుకోవడంతో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రమైంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఒక పరిష్కారం కనుగొనాలంటూ అన్నివైపులనుంచి ప్రభుత్వంపై వత్తిళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోధరలు మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచే స్థాయిలో పెరగడం సర్వత్రా ఆందోళనకు కారణమవుతోంది. దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్‌లపై అత్యధిక రిటైల్ ధరలు వసూలు చేస్తున్నది కేవలం భారత్ లోనే. ఈ ధరల్లో 40-50 శాతం వరకు పన్నుల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో భారత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశం భారత్. 80 శాతం చమురు ఆవసరాలు కేవలం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇదిలావుండగా కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు. ‘ప్రభుత్వం సామాన్యులను పరిగణలోకి తీసుకొని ఈ సమస్యకు స్పల్ప, దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొంటుంది’ అని స్పష్టం చేశారు. సింగపూర్ గ్యాసోలిన్ ధరలను, అరబ్ గల్ఫ్ డీజిల్ ధరలను ప్రమాణంగా తీసుకొని భారత్‌లోని పెట్రోల్, డీజిల్ ధరలను సరిపోల్చడం సాధారణంగా జరుగుతుంటుంది. గురువారం భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం, బ్రెంట్ క్రూడ్ ప్రమాణ ధర పెరగడం. 2014 నుంచి మొట్టమొదటిసారి గతవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్‌కు 80 డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నకాలంలో మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌లపై పన్నులు పెంచింది. ఈ పెంపుపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల భాజపా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది. దీని ప్రభావం ఈ ఏడాది చివర్లో చాలా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలపై తప్పక పడితీరుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల రైతులు, తయారీదారులు, వినియోగదారులపై అదనపు ఖర్చు భారం పెరుగుతుంది. అంతేకాదు ద్రవ్యోల్బణం వత్తిడి నేపథ్యంలో వడ్డీరేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కంపెనీ అధికార్లు పన్నుల తగ్గించడానికే ప్రాధాన్యతనిస్తుండగా, అంతర్జాతీయ ముడిచమురు ధరల తేడాల ప్రభావం ఉండకుండా దీర్ఘకాల ప్రాతిపదికన పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించాలని కేంద్రం యోచిస్తోంది.