బిజినెస్

‘స్వదేశీ దర్శన్’తో పర్యాటక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 26: ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత నగరాల్లో తీరైన నగరంగా పేరొందిన కాకినాడ తీర ప్రాంతం పర్యాటకంగా ప్రాధాత్యత సంతరించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న స్వదేశీ దర్శన్ పథకం కింద కాకినాడ తీర ప్రాంతాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడంతో గత నాలుగేళ్లలో సుందరమైన పర్యాటక కేంద్రంగా కాకినాడ తీరం నూతన శోభ సంతరించుకుంటోంది. స్వదేశీ దర్శన్ పథకం కింద సుమారు 69.66 కోట్ల వ్యయంతో తీర ప్రాంత సుందరీకరణ పనులు చేపట్టారు. 2017 డిసెంబరు నాటికే బీచ్ ఫ్రంట్ అభివృద్ధి పనులను చాలా వరకు పూర్తిచేశారు. గతేడాది డిసెంబరు నెలాఖరులో మూడు రోజులపాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. బీచ్ ఫెస్టివల్ నాటికి సాగర తీరంలో టూరిజం స్పాట్స్ అభివృద్ధిని యుద్ధప్రాతిపదికన చేపట్టారు. రిసార్ట్స్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో కాకినాడ వాకలపూడి బీచ్‌లో ఇప్పటికే హరిత రిసార్ట్స్ నిర్మించగా ఎన్టీఆర్ బీచ్‌లో కొత్తగా రిసార్ట్స్ నిర్మించారు. తాజాగా బీచ్ సుందరీకరణ పనులను నిర్వహిస్తున్నారు. బీచ్ సుందరీకరణ పనులు పూర్తయితే కాకినాడ సాగర తీర రూపురేఖలు మారిపోనున్నాయి. మరో 25రోజుల్లో బీచ్ సుందరీకరణ పనులను పూర్తిచేయనున్నట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. పర్యాటకులను అలరించేందుకు వివిధ రకాల ఆకర్షణలతో సాగర తీరాన్ని అభివృద్ధి చేయనున్నారు. వాటర్ ఫౌంటేన్లు, గ్రాస్ వంతెన, లేజర్ షో, థియేటర్, వాణిజ్య సముదాయం, కాన్ఫరెన్స్ హాలు వంటి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. స్వదేశీ దర్శన్ పథకం కింద ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 69.66 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం 45.66 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. స్వదేశీ దర్శన్ కింద కాకినాడ బీచ్ సహా మరో ఆరు ప్రాంతాలను టూరిజం స్పాట్స్‌గా అభివృద్ధి చేస్తున్నారు. మడ అడవులకు ప్రసిద్ధిగాంచిన కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్, కాకినాడ బీచ్‌లు వేటికవే ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. పర్యాటకులు ఈ మూడు స్పాట్స్‌లో విహరించేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీల ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కోరంగి అభయారణ్యాన్ని, హోప్ ఐలాండ్ ల్లో పర్యటించేందుకు వీలుగా ప్రస్తుతం బోటు సౌకర్యం అందుబాటులో ఉంది.