బిజినెస్

అనిశ్చితిలోనూ సానుకూల ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 26: అత్యంత అనిశ్చితిలో సాగిన ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎదుగూ బొదుగూ లేకుండా ముగిశాయి. మార్కెట్ కీలక సూచీల పెరుగుదలను అనిశ్చితి నిరోధించింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో మొత్తంమీద కీలక సూచీలు స్వల్ప లాభాలతో సానుకూల ధోరణిలో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ క్రితం వారంతో పోలిస్తే 76.57 పాయింట్లు పుంజుకొని, 34,924.87 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కేవలం 8.75 పాయింట్లు పెరిగి 10,605.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నెలకొన్న రాజకీయ అనిశ్చితితో పాటు తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత గ్రూప్‌కు చెందిన కాపర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజాందోళనలు హింసాత్మకంగా మారి 11 మంది మృతికి దారితీయడంతో స్టాక్ మార్కెట్లలో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా దేశ స్థూల ఆర్థిక గణాంకాలు బలహీనపడటం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప మూడు రోజులకే అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోకుండానే తన పదవికి రాజీనామా చేయడంతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా అనిశ్చితి మధ్య ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిస్థితులు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాదాలపై చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయన్న నమ్మకం మదుపరులలో కొరవడటంతో పాటు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరగవలసి ఉన్న సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకోవడంతో మళ్లీ అనిశ్చితి నెలకొనడం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే పడిపోయిన రూపాయి విలువ ఐటీ సూచీ పుంజుకోవడానికి దోహదపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదలలో కాస్త విరామం లభించడంతో పాటు కొన్ని కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక లాభాలు ప్రోత్సాహకరంగా ఉండటం, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) తగినంత స్థాయిలో కొనుగోళ్లు జరపడం వంటి వాటివల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో నష్టాల్లోకి పడిపోకుండా నిరోధించగలిగాయి. సెనె్సక్స్ ఈ వారం 34,873.16 పాయింట్ల గరిష్ఠ స్థాయి వద్ద ప్రారంభమయి, 35,017.93- 34,302.89 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 76.57 పాయింట్ల (0.22 శాతం) ఎగువన, 34,924.87 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం వారంలో 687.49 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ ఈ వారంలో 10,616.70 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 10,628.05- 10,417.80 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 8.75 పాయింట్ల (0.08 శాతం) ఎగువన 10,605.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో నికరంగా రూ. 3,481.43 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.