బిజినెస్

ఆర్థికాభివృద్ధిలో తిరుగులేని భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 6: ఆర్ధిక రంగంలో శరవేగంగా భారత్ అభివృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ ఏడాది 7.3 శాతం వృద్ధిరేటుతో, వచ్చే రెండేళ్లు 7.5 శాతం వృద్ధిరేటుతో భారత్ దూసుకుపోతుందని ఆ బ్యాంకు అధికారి తెలిపారు. నిలకడతో కూడిన అభివృద్ధిని భారత్ సాధిస్తోందని ఆయన తెలిపారు. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టులో ఈ అంశాలను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ప్రపంచ ఎకానమీ పేరుతో విడుదలైన నివేదికలో భారత్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. దక్షిణాసియా 2018లో 6.9 శాతం, 2019లో 7.1 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంచనా. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అగ్రగామిగా భారత్ నిలుస్తుందని ప్రపంచ బ్యాంక్ డెవలప్‌మెంట్ ప్రోస్పెక్ట్స్ గ్రూప్ డైరెక్టర్ అహ్యాన్ కోస్ తెలిపారు. 2018 నుంచి భారత్ వృద్ధిరేటుపై వేసిన అంచనాల అంకెలలో ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం భారత్ బలమైన స్థానంలో ఉందన్నారు. వాణిజ్యపరంగా ప్రపంచ దేశాల్లో వత్తిడి పెరిగిందని, దీని వల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు అభివృద్ధిలో నిలదొక్కుకుంటున్నాయని, ఆ తర్వాత స్థానాల్లో ఆఫ్గనిస్తాన్, భూటాన్, మాల్దీవులు నిలుస్తాయన్నారు. ఆర్థిక లోటు, సంస్కరణల అమలులో జాప్యం, బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచకపోవడం వల్ల సమస్యలు కొన్ని దేశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కాగా ప్రాంతీయ సహకారం వల్ల అభివృద్ధి ఊపందుకుంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారత్ ఆర్థికంగా రాణిస్తోందని, పెట్టుబడులు బాగా వస్తున్నాయని కోస్ చెప్పారు. ఏడు శాతం దాటి వృద్ధిరేటు సాధించడం, ఈ అంకెను నిలబెట్టుకోవడం వల్ల భారత్ ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని ఆయన చెప్పారు.