బిజినెస్

ఆస్కార్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రమోటర్లపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: ఆస్కార్ మేనేజిమెంట్ సర్వీసెస్‌కు చెందిన ఏడుగురు ప్రమోటర్లు, డైరెక్టర్లపై నాలుగేళ్లపాటు స్టాక్ మార్కెట్ లావాదేవీలు నిర్వహించకుండా సెబి నిషేధం విధించింది. ఈ సంస్థ ఇనె్వస్టర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని సెబి ఆదేశించింది. ఆస్కార్ మేనేజిమెంట్ రూ.45లక్షల విలువైన 4.5 లక్షల వాటాలను 450 మందికి 2007-08లో కేటాయించింది. కంపెనీ చట్టం ఉల్లంఘించి 49 మంది కంటే మించి వాటాలను కేటాయించారని, ఈ కంపెనీ వాటాలను స్టాక్ మార్కెట్‌లో లిస్టు చేయాల్సి ఉంటుందని సెబి పేర్కొంది. ఈ విషయమై సెబి ఇచ్చిన ఆదేశాలను ఈ సంస్థ తుంగలో తొక్కింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద కూడా ఈ సంస్థ నమోదు చేసుకోలేదు. దీంతో సెబి ఈ సంస్ధ ప్రమోటర్లను స్టాక్‌మార్కెట్ ఆపరేషన్స్ చేయకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వేటు పడిన వారిలో డైరెక్టర్లు ప్రవాష్ చంద్ర రోట్, మున మహదేవ్ పాత్రో, తారా ప్రసాద్ హోతా, కృతి రంజన్ బస్తియా, అబని కంతా పట్నాయక్, సచిత్రా పాత్రో. గురు బలియార్ సింగ్ ఉన్నారు.