బిజినెస్

రెండోరోజూ లాభాలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు గురువారం లాభపడ్డాయి. ఇటీవల ధరలు పడిపోయిన స్థిరాస్తి, లోహ, ఇంధన, బ్యాంకింగ్ షేర్లను మదుపరులు విరివిగా కొనుగోలు చేయడంతో మార్కెట్ కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎస్‌ఎంఈల)కు సంబంధించి ఎన్‌పీఏ వర్గీకరణ నియమాలను సరళీకరించిన మరుసటి రోజే గురువారం ఈ కంపెనీల షేర్లకు మదుపరుల నుంచి మంచి ఆదరణ లభించింది. స్పెక్యులేటర్లు షార్ట్ కవరింగ్‌కు పూనుకోవడంతో పాటు దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) తగిన స్థాయిలో కొనుగోళ్లు జరపడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడటానికి దోహదపడింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఇంట్రా-డేలో 425 పాయింట్లకు పైగా పుంజుకొని, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 284.20 పాయింట్ల ఎగువన, 35,463.08 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 83.70 పాయింట్ల ఎగువన 10,768.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు సూచీలు కూడా మే 15 తరువాత ఇంత గరిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనతో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచుతూ, ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాను యథాతథంగా కొనసాగిస్తూ బుధవారం తన ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రకటించిన తరువాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ చోటు చేసుకుంది. ఆర్‌బీఐ వృద్ధి అంచనాలను తగ్గించకపోవడం మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. సెనె్సక్స్ గురువారం ఉదయం 35,278.38 పాయింట్ల పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయి, ఇంట్రా-డేలో మరింత పైకి ఎకబాకుతూ 35,628.49 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 284.20 పాయింట్ల (0.81 శాతం) ఎగువన 35,463.08 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10,818.00, 10,722.60 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 83.70 పాయింట్ల (0.78 శాతం) పైన 10,768.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, డీఐఐలు బుధవారం నాటి లావాదేవీలలో నికరంగా రూ. 712.31 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ ఫండ్‌లు రూ. 81.40 కోట్ల విలువయిన షేర్లను విక్రయించాయి.
గురువారం సెనె్సక్స్ ప్యాక్‌లోని టాటా స్టీల్ అత్యధికంగా 3.73 శాతం లాభపడింది. టాటా మోటార్స్ 3.32 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థలలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఆసియన్ పెయింట్స్, రిల్, హెచ్‌యూఎల్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, అదాని పోర్ట్స్ ఉన్నాయి. మరోవైపు, కోల్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో నష్టపోయాయి.