బిజినెస్

ఎయిరిండియా విక్రయానికి మళ్లీ ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: ఎయిరిండియా వాటాలను వేలానికి పెట్టినా ఒక్కరు కూడా కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో, మళ్లీ ఈ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు కొత్త ప్రతిపాదనలు తేవాలని కేంద్రం నిర్ణయించింది. కొనుగోలుకు సంబంధించి బిడ్డింగ్ మార్గదర్శకాలను సవరించనున్నారు. ఎయిరిండియా కొనుగోలుకు బిడ్డర్లు ముందుకు రాకపోవడానికి కారణాలపై కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ విశే్లషిస్తోం ది. కొనుగోలుకు ఒక్క బిడ్డర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్టును దాఖలు చేయలేదు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణపై వెనక్కు తగ్గేది లేదని, ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సం స్థకు బిడ్స్ దాఖలుకు మే 31తో గడువు ముగిసింది. ఈ సం స్థకు బిడ్స్‌కు దాఖలు కాకపోవడానికి దారితీసిన కారణాలపై కేంద్రం నిపుణుల సలహాను తీసుకుంటోంది. అవసరమైతే పీఐఎం సవరణలు తీసుకొస్తామని అధికారవర్గాలు తెలిపాయి. ఎయిరిండియాపై విదేశీ ఇనె్వస్టర్లకు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం పీఐఎం సవరణల ముసాయిదాను మదింపు కమిటీకి పంపనున్నారు. ఈ కమిటీ డిపార్టుమెంట్ ఆఫ్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్‌మేనేజిమెంట్ పరిధిలో పనిచేస్తుంది. అనంతరం కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలోని కోర్ గ్రూపుకు ఈ ముసాయిదాను పంపిస్తారు. అనంతరం ఈ నెలాఖరుకు తుది సవరణ ముసాయిదాను కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి కార్యాయానికి పంపిస్తారు. ఆ తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తారు. ఎయి రిండియాలో 76 శాతం వాటాలను విక్రయించి, కంపెనీ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం సిద్ధమైన విషయం విదితమే. ప్రస్తుతం ఎయిరిండియా రూ.33వేల కోట్ల రుణ భారంతో సతమతమవుతోంది.