బిజినెస్

కొన్ని రంగాలకు ఆదాయ వత్తిళ్లు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 18: 2019 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రంగానికి రుణాలు స్థిరంగా ఉంటాయని అంచనా. అయితే ఎయిర్‌లైన్స్, టెలికామ్, రియల్ ఎస్టేట్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ, చక్కెర రంగాలు ఆదాయ పరమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశముందని ఒక నివేదిక పేర్కొంది. ‘్భరత కార్పొరేట్ రంగం, రుణ సమీక్ష-2019’ పేరిట ఇక్రా సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. వస్తువుల ధరలు పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు వడ్డీరేట్ల నేపధ్యంలో ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్, వినియోదారుల వస్తువులు, ఎఫ్‌ఎంసీజీ, రసాయనాలు, పెయింట్స్ మొదలైన వాటి ఆదాయం, రుణాలపై ప్రభావం చూపుతాయని ఇక్రా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ అన్నారు. గత రెండేళ్ల కాలంలో వినియోగదారుల డిమాండ్ పెరగడం వల్ల కార్పొరేట్ సంస్థల ఆదాయం పెరిగిందని వివరించింది. ఈ పోకడ 2018 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగింది. ముఖ్యంగా వినియోగ వస్తువుల ధరలు, వినియోగ డిమాండ్ పెరగడంతో పరిస్థితి ప్రోత్సాహకరంగా సాగిందని వెల్లడించింది. ఆటోమోబైల్స్, ఎఫ్‌ఎంసీజీ, వినియోగ మరియు రిటైల్ వస్తువులకు డిమాండ్ పెరిగింది.