బిజినెస్

ఆధార్‌ను సమర్థించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధార్‌ను గట్టిగా సమర్ధించారు. ప్రపంచలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు కార్యక్రమం అయిన ఆధార్ వల్ల ప్రయోజనాలు ఇప్పటికే స్పష్టమయ్యాయన్నారు. దీనివల్ల 121 కోట్లమంది ప్రజలు యూనిక్ ఐడీ నెంబరు హోల్డర్లకు లబ్ది చేకూరిందన్నారు. ఒకవేళ ఆధార్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి కాకుంటే, ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఇప్పటికే ఆధార్‌కు అనుకూలంగా న్యాయవాదుల బృందం సాక్ష్యాధారాలతో సహా సుప్రీంకోర్టులో తమ వాదనలను వినిపించాయన్నారు. ఆధార్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. గత నాలుగేళ్ల కాలంలో తన నేతృత్వంలోని ఐటీ మంత్రిత్వశాఖ సాధించిన విజయాలను ఆయన వివరించారు. ఆధార్ చట్టాన్ని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవల్లో బయోమెట్రిక్ గుర్తింపును అమలు పరచడాన్ని సవాలు చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం హయాంలోని ఆధార్‌కు, ఇప్పటి ఆధార్‌కు ఎంతో తేడా ఉన్నదన్నారు. నాటి ఆధార్‌కు చట్టపరమైన మద్దతు లేదు. కానీ నేటి ఆధార్ పార్లమెంట్ చట్టంతో బలోపేతమైందన్నారు. 2014లో కేవలం 61 కోట్ల ఆధార్ నెంబర్లు మాత్రమే ఇవ్వగా, 2018, జూన్ 16 నాటికి వీటి సంఖ్య 121 కోట్లకు చేరుకున్నదన్నారు. 59.15 కోట్ల మంది పౌరులు 87.89 కోట్ల బ్యాంకు ఖాతాలకు తమ ఆధార్‌ను అనుసంధానించారన్నారు. నిరుపేదలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కింద రూ.4 లక్షల కోట్లను పేదలకు బదిలీ చేశామని మంత్రి వెల్లడించారు.