బిజినెస్

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: పెరుగుతున్న చమురు ధరలపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో, అరుణ్ జైట్లీ మొదటిసారి పెదవి విప్పారు. దేశ పౌరులు సక్రమంగా పన్నులు చెల్లిస్తే, అప్పుడు చమురుపై ఆధారపడటం తగ్గుతుందంటూ చావుకబురు చల్లగా చెప్పారు. అందువల్ల పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ఆవిధంగా ధరలు తగ్గిస్తే అతి ప్రతికూల పరిణామానికి దారితీస్తుందని కూడా పేర్కొన్నారు.
నిజానికి దేశంలో ఉద్యోగులు మాత్రమే పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారు. ఇంకా చాలా వర్గాలు పన్ను చెల్లించే తీరు మెరుగైందని పేర్కొన్నారు. ‘రాజకీయ నాయకులు, ఒపీనియన్ మేకర్లకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. చమురేతర రంగంలో పన్నులు సక్రమంగా చెల్లిస్తే, చమురుపై పన్నులు విధించడం క్రమంగా తగ్గిపోతుంది.’ ఈ సత్యాన్ని వారు గుర్తించాలన్నారు. గత నాలుగేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ పన్ను-జీడీపీ నిష్పత్తి 10 శాతం నుంచి 11.5 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఇందులో జీడీపీలో దాదాపు సగం అంటే 0.72 శాతం, చమురేతర-జీడీపీ నిష్పత్తి పెరుగుదల వల్ల ఏర్పడిందన్నారు.
2007-08 నుంచి పరిశీలిస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా జీడీపీలో చమురేతర పన్నులు 9.8 శాతం నమోదయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రాలు చమురుపై విధిస్తున్న అసాధారణ పన్నులు తగ్గిస్తే వినియోగదార్లపై భారం తగ్గుతుందన్నారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.25 వరకు పన్ను తగ్గించడం సాధ్యమని చిదంబరం చేసిన ప్రకటనను ప్రస్తావించగా అది ‘తప్పుడు వివరణ’ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ‘పన్ను-జీడీపీ’ నిష్పత్తిని మెరుగు పరచడానికి కృషి చేస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ పన్నులో తగ్గించే ప్రతి రూపాయి వల్ల ప్రభుత్వానికి రూ.13వేల కోట్ల మేర ఆదాయం పడిపోతుందనేది ప్రభుత్వ అంచనా.