బిజినెస్

ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 18: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం దేశీయ మార్కెట్లు మందగొడిగా సాగాయి. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు ప్రభావం మార్కెట్లపై పడింది. చైనానుంచి దిగుమతి అయ్యే 50 బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన దిగుమతులపై పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామని డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. దీనికి దీటుగా చైనాకూడా స్పందించే అవకాశముంది. రెండు ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతున్న వాణిజ్యపోరు ప్రభావం సహజంగానే అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. ఇది దేశీయ మార్కెట్లపై కూడా కొనసాగింది. ఫలితంగా రోజంతా దేశీయ మార్కెట్లు ఊగిసాటలో కొనసాగాయి. సెనె్సక్స్ 73.88 పాయింట్లు నష్టపోయి, 35,548.26 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 17.85 పాయింట్ల నష్టంతో 10,799,95 వద్ద ముగిసింది. ఈ నెలలో విదేశీ మదుపర్లు దేశీయ మూలధన మార్కెట్లనుంచి రూ.55 బిలియన్లను వెనక్కు తీసుకున్నారు. ఇక అంతర్జాతీయ వాణిజ్యపోరుతో పాటు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలు ఈ స్థితికి కారణం. గత రెండు నెలల కాలలో దేశీయ మార్కెట్ల నుంచి రూ.450 బిలియన్లు తరలిపోయాయి. గత మార్చిలో విదేశీ పోర్టుపోలియో మదుపర్లు రూ.26 బిలియన్ల వరకు దేశీయ మార్కెట్లలో మదుపు చేశారు. ఇదిలావుండగా సీఈఓలను మార్చే అవకాశమున్నట్టు వస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఐసీఐసీఐ షేర్లు సోమవారం బాగా లాభపడ్డాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మారుతి, ఎన్‌టీపీసీలు లాభపడగా, ఇండస్‌లాండ్ బ్యాంక్, వేదాంత లిమిటెడ్, కోటక్ మహేంద్ర, భారతీ ఎయిర్ టె ల్, కోలిండియా, యాక్సిస్ బ్యాంకు, టాటాస్టీల్ షేర్లు నష్టపోయాయి.