బిజినెస్

నాలుగో త్రైమాసికంలో 7.7శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 7.7 శాతం ఆర్థిక ప్రగతి, ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా సువ్యవస్థాపితం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మరికొనే్నళ్లపాటు ఇదే పోకడ కొనసాగుతుందని అంచనా వేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగా భారత్ జీడీపీ రెండు శాతం తగ్గలేదని, గత ఆర్థిక మంత్రులు అంచనా వేసినట్టు భారత్ పేదరికంలో మగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. ‘నోట్ల రద్దు, జీఎస్టీ, దివాలాచట్టం అమలు వల్ల రెండు త్రైమాసికాల్లో సవాళ్లు ఎదుర్కొన్నాం. అయితే జీడీపీ 2 శాతం పడిపోతుందన్న విమర్శకుల అంచనా తప్పని ఇప్పుడు రుజువైంది’ అని జైట్లీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘నాకు ముందు ఆర్థిక మంత్రిగా సుప్రసిద్ధుడు, దేశం పేదరికంలో మగ్గిపోతుందని భయపడ్డారు. కానీ మేం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి పథంలో పరుగులు పెడుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నాం. మరికొనే్నళ్లు ఇదే పోకడ కొనసాగుతుంది’ అని ఆయన స్పష్టం ఏచేశారు.
నోట్లరద్దు, జీఎస్టీ అమలు కారణంగా దేశ ఆర్థిక ప్రగతి 2 శాతం వరకు తగ్గవచ్చునని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచనా వేశారు. ఇక మరో మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా అయితే మరింత ముందుకుపోయి, మోదీ విధానాలు పేదలను మరింత పేదలుగా మారుస్తున్నాయంటూ విమర్శించారు. మరో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఒక దశలో మాట్లాడుతూ, ప్రభుత్వ చమురుపై పన్ను తగ్గిస్తే చమురు ధర లీటరుకు రూ.25 వరకు తగ్గుతుందని చెప్పారు. ఈవిధంగా చెప్పడం కేవలం తప్పుదోవ పట్టించడం మాత్రమేనని జైట్లీ పేర్కొన్నారు. దేశాన్ని భరించలేని అప్పుల్లో కూరుకుపోయేలా చేయడం యుపీఏ నైజమని ఆరోపించారు. ‘నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా ఆర్థక వ్యవస్థ, మార్కెట్లలో ఆర్థిక వివేచన, స్థూల-ఆర్థిక స్థిరత్వం చోటు చేసుకుంటాయి. వీటివల్ల ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం, బాధ్యతా రాహిత్యం తగ్గుతుంది’ అన్నారు. యుపిఏ అనుసరింని ‘విధానపరమైన ప్రతిష్ఠంభన’ నుంచి ఎన్‌డీఏ విధానమైన ‘వేగవంతమైన ఆర్థిక ప్రగతి’కి మార్పు చెందడాన్ని ఇప్పుడు చూస్తున్నామన్నారు.