బిజినెస్

రెండోరోజూ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం నష్టపోయాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాదం మళ్లీ రగుల్కోవడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బలహీనపడ్డాయి. అదే దారిలో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ మంగళవారం 262 పాయింట్లు పడిపోయి రెండు వారాల గరిష్ట స్థాయి అయిన 35,286.74 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 89 పాయింట్లు దిగజారి 10,710.45 పాయింట్ల వద్ద స్థిరపడింది. చైనా సరుకుల దిగుమతులపై అదనపు సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం, దీంతో ప్రతి చర్యకు దిగుతామని చైనా ప్రకటించిన తరువాత ప్రపంచంలోని ఈ రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పూర్తి స్థాయిలో వాణిజ్య యుద్ధం సంభవిస్తుందేమోననే భయాందోళనలు అలుముకొని ఆసియా స్టాక్ మార్కెట్లు అకస్మాత్తుగా పడిపోయాయి. విదేశీ ఫండ్‌లు నిరంతరాయంగా అమ్మకాలు జరపడం, రూపాయి బలహీనపడటం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణమయ్యాయి. సెనె్సక్స్ మంగళవారం ఉదయం సానుకూలంగానే మొదలయినప్పటికీ, కొంత సేపటికే అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 261.52 పాయింట్ల (0.74 శాతం) దిగువన 35,286.74 పాయింట్ల వద్ద ముగిసింది. జూన్ ఆరోతేదీ తరువాత ఈ సూచీ ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. జూన్ 6న ఈ సూచీ 35,178.88 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ మంగళవారం క్రితం ముగింపుతో పోలిస్తే 89.40 పాయింట్ల (0.83 శాతం) దిగువన 10,710.45 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) సోమవారం నికరంగా రూ. 754.43 కోట్ల విలువ గల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 824.10 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.సెనె్సక్స్ ప్యాక్‌లోని వేదాంత మంగళవారం అత్యధికంగా 3.55 శాతం లాభపడింది. అదాని పోర్ట్స్ రెండు శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థలలో ఎంఅండ్‌ఎం, రిల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, మారుతి సుజుకి, టాటా మోటార్స్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, ఆసియన్ పెయింట్స్, కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్, హీరో మోటాకార్ప్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.94 శాతం వరకు పడిపోయింది. అయితే, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఓఎన్‌జీసీ మాత్రమే నష్టాల నుంచి తప్పించుకోగలిగాయి. అన్ని రంగాల సూచీలు పడిపోయాయి.