బిజినెస్

ఉద్యాన పంటలే లాభసాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: ఉద్యాన పంటలే రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తాయని హార్టీకల్చర్ విభాగం ఏడీ ఎం శరవరణన్ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ సంయుక్తంగా విశాఖలో రైతుల కోసం మంగళవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే పంటలను ప్రాసెసింగ్ చేయడం వల్ల ఆదాయం పెరుగుతుందన్నారు. ఉత్పత్తుల ప్రాసెసింగ్ వల్ల వాటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుందని, తద్వారా వీటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. మల్టీ మార్కెంటింగ్ వ్యవస్థ వల్ల దేశానికి విదేశీ మారకద్రవ్యం లభిస్తుందన్నారు. ఇది రైతులకు కూడా లాభదాయకమన్నారు. రైతులు ‘్ఫర్మర్ ప్రొడ్యూసర్స్’గా ఉమ్మడి వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఉద్యాన పంటలు పండించే రైతులు హార్టీకల్చర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వ పరంగా అందే రాయితీలు, సదుపాయాలు వర్తింపచేసుకోవాలన్నారు. పరిశ్రమల చీఫ్ అడ్వైజర్ ఎ శివప్రసాద్ మాట్లాడుతూ రైతులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యాన పంటల ద్వారా అధిక లాభాలు దక్కించుకోచ్చన్నారు. రైతుల పంటలను ప్రాసెసింగ్ చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.