బిజినెస్

ఉద్యాన వర్సిటీలో రైతు పిల్లలకు రిజర్వేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 2018-19 సంవత్సరానికి చేరేందుకు ప్రస్తుతం ఉన్న నియమావళిలో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో బుధవారం జీఓ జారీ అయింది. ఈ జీఓ ప్రకారం ఉద్యా న విశ్వవిద్యాలయం పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరే విద్యార్థులు వ్యవసాయ కోటాలో సీటు కావాలనుకుం టే అభ్యర్థికి కానీ, వారి తల్లిదండ్రులకు కానీ ఒక ఎకరా భూమి ఉంటే చాలని పేర్కొన్నారు. గతంలో కనీసం మూడెకరాల భూమి ఉండాలని నియమావళిగా ఉండేది. అలాగే విద్యార్థి నాలుగేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో (నాన్-మున్సిపల్) చదివి ఉండాలని నియమావళిలో పొందుపరచారు. మిగతా నియమావళి యథాతథంగా ఉంటుందని వివరించారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చే విద్యార్థులకు మొత్తం సీట్లలో నలభై శాతం సీట్లను రిజర్వ్ చేశారు.