బిజినెస్

ఉత్తమ్‌పై ఫిర్యాదు అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు, శాసన సభ్యులు బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు దేశ రాజధానిలో చర్చ జరుగుతున్నది. కానీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కార్యదర్శి కుంతియా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌పై కొంత మంది ఫిర్యాదు చేసినట్టు వచ్చిన వార్త అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలావుంటే, రాహుల్ గాంధీ వారం, పది రోజుల్లో టీకాంగ్రెస్ నాయకులతో విడిగా చర్చలు జరిపి వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకోనున్నట్టు సమాచారం రావడంతో, ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్వనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు మొత్తం ఇరవై మంది నాయకులు బుధవారం రాహుల్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కుంతియా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాకపోవటం గమనార్హం.
నివేదిక ఇచ్చాం..
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరు, తదితర అంశాలపై ఒక సమగ్ర నివేదికను రాహుల్‌కు అందజేశామని కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క విలేఖరులతో చెప్పారు. రాహుల్‌కు ఇచ్చిన నివేదికపై నలభై మంది పార్టీ సీనియర్ నాయకులు సంతకాలు చేశారని ఆయన చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన నాయకులందరితో ముఖాముఖి చర్చలు జరిపి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని రాహుల్‌ను కోరినట్టు ఆయన వెల్లడించారు. చర్చలు జరిపేందుకు సమయం కేటాయించాలని పార్టీ ఆధ్యక్షుడిని కోరినట్లు తెలిపారు.