బిజినెస్

పుంజుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 20: వరుసగా రెండు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మంచి లాభాలను ఆర్జించాయి. ఒకవైపు ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల ప్రభావంతో పాటు ఇటీవల ధరలు పడిపోయిన లోహ, బ్యాంకింగ్ రంగాల షేర్లను దక్కించుకోవడానికి మదుపరులు ఉత్సాహం చూపడం వల్ల దేశీయ మార్కెట్ కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 261 పాయింట్లు పుంజుకొని 35,547.33 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 61.60 పాయింట్లు పెరిగి 10,772.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ బుధవారం అత్యధికంగా 2.44 శాతం పుంజుకొని, గరిష్ఠ స్థాయిలో రూ. 1,019.95 వద్ద ముగిసింది. అమెరికా, చైనాల మధ్య తాజా వాణిజ్య వివాదాల ఉద్రిక్తతలతో నష్టపోయిన ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్లు బుధవారం తిరిగి బలపడ్డాయి. సెనె్సక్స్ బుధవారం సెషన్ అంతా సానుకూల జోన్‌లో సాగింది. మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో ఇంట్రా-డేలో 35,571.37 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 260.59 పాయింట్ల (0.74 శాతం) పైన 35,547.33 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 335.40 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ బుధవారం 61.60 పాయింట్లు (0.58 శాతం) పుంజుకొని 10,772.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,781.80, 10,724.05 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) మంగళవారం నికరంగా రూ. 653.68 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 1,324.92 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని లాభపడిన ఇతర సంస్థలలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, వేదాంత, యెస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఉన్నాయి. అయితే ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్, విప్రో, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్ షేర్ల ధరలు పడిపోయాయి. రంగాల వారీ సూచీలలో బీఎస్‌ఈ మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 1.09 శాతం పుంజుకుంది. బ్యాంకెక్స్ 1.04 శాతం, రియల్టీ 0.83 శాతం లాభంతో తరువాత స్థానాల్లో నిలిచాయి.