బిజినెస్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీఎండీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పుణేలోని రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎస్ కులకర్ణి, అతని భార్యపై నమోదయిన చీటింగ్ కేసులో పుణే పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు బుధవారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుత, మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. బ్యాంకు ప్రస్తుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రవీంద్ర మరాఠే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర గుప్తా, జోనల్ మేనేజర్ నిత్యానంద్ దేశ్‌పాండే, బ్యాంకు మాజీ సీఎండీ సుశీల్ ముహ్‌నోత్, కులకర్ణి సీఏ సునిల్ ఘట్‌పాండే, కులకర్ణికి చెందిన సంస్థ డీఎస్ కులకర్ణి డెవలపర్స్ లిమిటెడ్ (డీఎస్‌కేడీఎల్) ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ నెవాస్కర్‌లను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దేశ్‌పాండేను అహ్మదాబాద్‌లో, ముహ్‌నోత్‌ను జైపూర్‌లో అరెస్టు చేశారు. మిగతా నలుగురిని పుణేలో అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. అరెస్టయిన ఆరుగురిపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కులకర్ణిపై నమోదయిన చీటింగ్ కేసును దర్యాప్తు చేయగా, బ్యాంకు అధికారులు డీఎస్‌కేడీఎల్‌తో కుమ్మక్కయి ఆ సంస్థకు రుణం మంజూరులో తమ అధికారాల దుర్వినియోగానికి పాల్పడి మోసపూరితంగా వ్యవహరించినట్టు తేలిందని ఆర్థిక నేరాల విభాగం పోలీసు డిప్యూటి కమిషనర్ సుధీర్ హీరేమంత్ తెలిపారు.